Janaki Kalaganaledu : జెస్సీ అవతారం చూసి జ్ఞానాంబ షాక్.. అఖిల్, జెస్సీలను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 24 September 2022, 10:00 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 26 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 396 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను నిన్ను కేవలం నా కడుపులో ఉన్న బిడ్డ కోసం, నా తల్లిదండ్రుల కోసమే పెళ్లి చేసుకున్నా అని అంటుంది జెస్సీ. దీంతో అఖిల్ కు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో తన మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడు. అమ్మకు భయపడే ఇలా చేశా. ఐయామ్ సారీ జెస్సీ అంటాడు. తనను హత్తుకుంటాడు. కాళ్లు పట్టుకుంటాడు. దీంతో జెస్సీ మనసు కరిగిపోతుంది. మళ్లీ అఖిల్ ను గుడ్డిగా నమ్ముతుంది జెస్సీ.

rama encourages janaki to study well for her ips exam

rama encourages janaki to study well for her ips exam

కట్ చేస్తే జానకి గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అని అనుకుంటుంది జ్ఞానాంబ. నా కోడలను అనవసరంగా అనుమానించాను అని అనుకుంటుంది. అనవసరంగా ఐదు తప్పుల్లో ఒక తప్పు కొట్టేశాను అని అనుకుంటుంది. నా కోడలును అవమానించాను అని అనుకుంటుంది. వెళ్లి గోడ మీద రాసి ఉన్న ఆ ఒక్క తప్పును చెరిపేందుకు ప్రయత్నిస్తుంది జ్ఞానాంబ. కానీ.. అది చెరిగిపోదు. పొరపాట్లు అయితే చెరిగిపోతాయి కానీ.. తప్పులు కాదు జ్ఞానం అంటాడు గోవిందరాజు. జానకి గురించి తెలిసి కూడా నువ్వు నీ కోడలును తప్పుగా అర్థం చేసుకున్నావు అని అంటాడు గోవిందరాజు.

తను కోడలుగా రావడం దేవుడు మనకిచ్చిన వరం అంటాడు గోవిందరాజు. దీంతో అవునండి.. తొందరపడి నేను కొన్నిమాటలు అన్నాను. వాటిని జానకి తన కడుపులో దాచుకుంది కానీ.. నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : జానకి ఐపీఎస్ చదువు మీద అనుమానం వ్యక్తం చేసిన జ్ఞానాంబ

జానకి మీద నాకు ఎలాంటి భయం లేదు కానీ.. ఇంటి సమస్యను, ఆశయాన్ని సమానంగా తను నష్టపోకుండా, ఎవరికీ నష్టం కాకుండా నెరవేర్చేది కానీ.. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడింది కానీ.. తన ఆశయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పరీక్షను రాయకుండా వదిలేసింది అంటుంది జ్ఞానాంబ.

జీవితం అన్నాక, కుటుంబ బాధ్యతలు తీసుకున్నాక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. ఈ సమస్యను తీర్చడానికే జానకి ఇంత ఇబ్బంది పడిందంటే.. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తిస్తుంది.. నేను తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టగలదు. ఇదే నా బాధ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే రామా.. జానకి చదువు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జానకి వచ్చి నేను కూడా అత్తయ్య మాటలు విన్నా అంటుంది జానకి. ముందే జెస్సీ, అఖిల్ ప్రేమ గురించి అత్తయ్య గారికి చెప్పి ఉంటే బాగుండేది. అత్తయ్య గారి మాటల వల్ల నేను చేసిన తప్పు నాకు తెలిసింది. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా నేను సరిదిద్దుకుంటాను అంటుంది జానకి.

మరోవైపు జెస్సీ టీషర్ట్, ప్యాంట్ వేసుకొని హాల్ లో కూర్చోవడంతో మల్లిక చూసి వెంటనే జ్ఞానాంబకు చెబుతుంది. దీంతో జానకిని పిలిచి జెస్సీకి పద్ధతులు నేర్పించాలని చెబుతుంది. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే బాగుండదు అంటుంది.

అయితే.. తన దగ్గర వేరే డ్రెస్సులు లేకపోవడంతో అఖిల్ వి వేసుకున్నా అని జానకితో అంటుంది జెస్సీ. కట్ చేస్తే అందరూ టిఫిన్ తింటూ ఉంటారు. అప్పుడే జెస్సీ పేరెంట్స్ వస్తారు. మిమ్మల్ని క్షమించండి అని జ్ఞానాంబను వేడుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి