Rama Rajamouli : నాకు డైవ‌ర్స్ అయి బాబు ఉన్నా త‌నే నాకు ప్ర‌పోజ్ చేశాడ‌న్న రాజ‌మౌళి భార్య‌

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 August 2024, 5:00 pm
  •  Rama Rajamouli : నాకు డైవ‌ర్స్ అయి బాబు ఉన్నా త‌నే నాకు ప్ర‌పోజ్ చేశాడ‌న్న రాజ‌మౌళి భార్య‌

Rama Rajamouli  : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ఈ మ‌ద్య త‌నకి సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది.మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి, రాజమౌళి సన్నిహితులు పలువురు బోలెడు ఆసక్తికర విషయాలు తెలిపారు. రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండో భర్త అని తెలిసిందే. రమాకి పెళ్లయి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె విడాకులు తీసుకోగా, ఆ తర్వాత రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమా తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.

Rama Rajamouli  రాజ‌మౌళి ప‌ట్టుబ‌ట్టాడు..

రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడాడు. రమా మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసాను. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా నా కోసం అలా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం అని తెలిపింది. రమా రాజమౌళి తనయుడు కార్తికేయ మాట్లాడుతూ.. ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళేవాళ్ళు అని తెలిపాడు.

Rama Rajamouli : నాకు డైవ‌ర్స్ అయి బాబు ఉన్నా త‌నే నాకు ప్ర‌పోజ్ చేశాడ‌న్న రాజ‌మౌళి భార్య‌

Rama Rajamouli : నాకు డైవ‌ర్స్ అయి బాబు ఉన్నా త‌నే నాకు ప్ర‌పోజ్ చేశాడ‌న్న రాజ‌మౌళి భార్య‌

ఇక రాజ‌మౌళి మాట్లాడుతూ.. మగధీర షూటింగ్ సమయంలో మాకు యాక్సిడెంట్ అయింది. మేము ఒక రిమోట్ ప్లేస్ లో డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరికి గాయాలు అయ్యాయి. రమకి నడుము కింద స్పర్శ కూడా పోయింది. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను అని తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయినట్టు తెలిపారు రాజమౌళి. ఇక జ‌క్క‌న్న ఇప్పుడు మ‌హేష్ బాబు మూవీతో బిజీగా ఉన్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp