Ramya Sri : ఇటీవల చాలా మంది నటీమణులు జీవితంలో ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి చెబుతూ వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు రమ్య శ్రీ. కన్నడంలో నటించిన ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు పొందారు. తెలుగు చిత్రం ఓమల్లి తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. నటనలోనే కాకుండా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ రంగాల్లో కూడా తనకు అనుభవం ఉంది. నటనకు, దర్శకత్వానికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. రమ్య హృదాలయ ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవలు చేస్తున్నట్ల చెప్పారు. నగరంలో నాలుగేళ్లుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది.
అయితే నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. కొన్ని చిత్రాల్లో ఆమె సోలోగా హాఫ్ న్యూ.. గా కూడా నటించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొందట. కొందరు తనని వాడుకోవాలని కూడా చూశారని.. ఇంకొందరు కారులోనే బలవంతం చేయబోయారని రమ్య శ్రీ తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది. ఏదైనా ఈవెంట్స్ కి నన్ను పిలవాలంటే కూడా.. ఆమె ఎందుకు అసభ్యంగా బట్టలు వేసుకుంటుంది అని విమర్శించేవారట. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాను నన్ను నమ్మి తీసుకున్న దర్శకులకు న్యాయం చేయాలి. సినిమా బాగా రావాలంటే దర్శకుడు కోరిన విధంగా బట్టలు వేసుకోవాలి అని రమ్య శ్రీ పేర్కొంది.
అమెరికాలో ఈవెంట్ జరిగినప్పుడు నన్ను పిలవాలని అనుకున్నారు. కానీ కొందరు మాత్రం ఆమె బట్టలు దారుణంగా వేసుకుంటుంది.. వద్దు అని అన్నట్లు నాకు తెలిసింది. కొంతమంది ఇంకా బట్టలు ఏంటి.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ చేశారట. మొత్తంగా నన్ను ఇన్వైట్ చేశారు. ఈవెంట్ లో నా బిహేవియర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సినిమాల్లో అలా కనిపిస్తారు.. కానీ ఇక్కడ ఇంత డీసెంట్ గా ఉన్నారు అంటూ ప్రశంసించారు. ఆ సినిమాల్లో లో నటించమని నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఆ సినిమాలు చేసేవాళ్ళు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. నేను చేయనంటే చేయను అని లాయర్ ని పెట్టుకుని మరీ వాదించాను. అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను అని రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.