Naga Chaitanya : నాగ చైత‌న్య‌పై రానా దగ్గుబాటి కామెంట్స్.. స‌మంత‌ని ఉద్దేశించి అన్నాడా.!

Authored By Sam C | The Telugu News | Published on: May 28, 2022, 3:00 pm

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌- నాగ చైత‌న్య నాలుగేళ్ల వివాహ బంధం త‌ర్వాత విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వీరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తూనే ఉంటుంది. వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’. జూలై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇందులో చై విభిన్న పాత్రల్లో కనిపించాడు.

ట్విటర్‌లో ఈ టీజర్‌ షేర్‌ చేస్తూ నాగ చైతన్య ‘నన్ను నేను సరిచేసుకోవాడినికే చేస్తున్న ప్రయాణమే థ్యాంక్‌ యూ’ అని క్యాపన్‌ ఇచ్చాడు. చై ట్వీట్‌పై రానా ఆసక్తిగా స్పందిచాడు.‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. రానా క్యాజువల్ గా విషెష్ చెప్పినా ఈ కామెంట్ ని సైతం సమంత, చైతు డైవర్స్ మ్యాటర్ లో కలిపేస్తున్నారు. ‘ఇక్కడేదో తేడా కొడుతుంది.. రానా అన్న ఇన్‌టెన్షన్.. సరి అయిపోయాడు (లైఫ్)లో అని’ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో నెటిజన్ సామ్‌ను వదిలిన దగ్గర్నుంచి సరి అయ్యాడా అని నవ్వుతున్న ఎమోజీలు పెడుతున్నారు.

Rana Daggubati Satires on naga chaitanya

Rana Daggubati Satires on naga chaitanya

Naga Chaitanya : రానా వేసేశాడుగా..

మరి కొంతమంది నెటిజన్స్ సైతం సామ్ మ్యాటర్‌లో సైలెంట్‌గా వేశావు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.రానా విషెస్‌పై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించింది. దీంతో రానా దగ్గుబాటికి థాంక్యూ చెప్పింది రాశీ ఖన్నా. ఈ చిత్రం లో రాశి ఖన్నా , అవికా గోర్, మాళవిక నెయిర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. . ల‌వ్‌స్టోరి, బంగార్రాజు వంటి హిట్ సినిమాల తరువాత నాగచైతన్య థియేటర్ల ముందుకు రానుండడంతో అక్కినేని ఫ్యాన్స్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp