F3 Movie : ఎఫ్ 3 కలెక్షన్స్‌కి బిత్తరపోతున్న ఇండస్ట్రీ వర్గాలు
F3 Movie : 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. ( రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ మూవీ వచ్చింది.
సీక్వెల్ కాదు.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సినిమా.తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ విషయానికి వస్తే.. నైజాంలో 18 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 53.8 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. కర్ణాటకలో 3.4 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.2 కోట్లు, ఓవర్సీస్‌లో 5.20 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 63.6 కోట్ల బిజినెస్ చేసింది. అలా 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అలాగే అమెరికాలో కూడా F3 చిత్రం వెంకీ, వరుణ్ తేజ్ క్రేజ్, ఇమేజ్‌కు తగినట్టుగానే వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో 500k డాలర్లను తొలి రోజే రాబట్టడం విశేషంగా మారింది. అలాగే యూకేలో కూడా భారీ మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.
F3 Movie : ఎఫ్ 3 అదరగొట్టేసిందిగా..
యూకేలో 43 లొకేషన్లలో 85 షోల ద్వారా 5700 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. ఈ చిత్రం చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.18 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షల హైర్స్‌తో కలిపి 76 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 55 లక్షల హైర్స్‌తో 94 లక్షలు, గుంటూరు జిల్లాలో 32 లక్షల హైర్స్‌తో 88 లక్షలు, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరు జిల్లాలో 14 లక్షల హైర్స్‌తో 61 లక్షలు రాబట్టింది. దాంతో 1.17 కోట్ల హైర్స్‌తో 17 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 51.15 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు లాభాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.