Rana Daggubati Takes Miheeka Permission To KS in Rana Naidu Web series
Rana Daggubati : ఇటీవలి కాలంలో ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చూస్తున్నాం. వాటికి మంచి ఆదరణ లభించడంతో వెబ్ సిరీస్‌లు కూడా రూపొందుతున్నాయి. అలా వెంకటేష్-రానా కలిసి త్వరలో ఓ వెబ్ సిరీస్‌తో పలకరించబోతున్నారు. గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్…ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో ఎఫ్ 3 చేసిన వెంకీ చైతూతో వెంకీ మామ చేశాడు. ఇప్పుడు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు. తాజాగా మరో ఒకటి రెండు మల్టీస్టారర్స్‌కు ఓకే చెప్పారు. ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇప్పుడు వెబ్ సిరీస్‌తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంది . ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది . కచ్చితంగా ఈ సినిమాలో వెంకటేష్ నటనకి మంచి మార్కులు వేయించుకుంటారని చెప్పవచ్చు .ఇక రానా అయితే ఘాటు ముద్దుతో అందరు షాక్ అయ్యేలా చేశాడు. ఈ వెబ్ సిరీస్‌లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోవడం టీజర్ లో చూడొచ్చు. పెళ్లి తర్వాత ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలని అనుకున్న రానా ఇందులో ఎలా చేశాడు అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Rana Daggubati Takes Miheeka Permission To KS in Rana Naidu Web series
రానా భార్య మిహికా తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడం ..దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రానా దగ్గుబాటి అలా ఆమెతో ఆ సన్నివేశాన్ని చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సాయం కావాలా అంటూ రానా డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులలో అంచనాలను రేకెత్తించే విధంగా సాగింది. ఈ టీజర్ ను బట్టి మనం పరిశీలిస్తే సెలబ్రిటీలకు ఏదైనా ఒక కష్టం వస్తే దాన్ని క్లియర్ చేసే వ్యక్తిగా రానా కనిపిస్తున్నాడు. ఒకరకంగా పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వస్తుంది. ఇక వెంకటేష్ ఒక ముసలి వ్యక్తిగా జైలు నుంచి విడుదలవుతున్నట్లుగా చూపించారు. టీజర్ ఆకట్టుకుంటుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.