Rashmika Mandanna : చీరలో రష్మికా మందన్న.. రణబీర్ చూపంతా అక్కడే..??
Rashmika Mandanna : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న కాంబినేషన్లో ‘ యానిమల్ ‘ సినిమా తెరకెక్కింది. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ వంగ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో సినిమా టీం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 23న విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మందన , రన్బీర్ కపూర్ పాల్గొన్నారుష ఈ క్రమంలోనే వీరిని చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్లో మొదటి నుంచి చివరి దాకా తండ్రి కొడుకుల థీమ్ తోనే డిజైన్ చేశారు సందీప్ రెడ్డి వంగా. అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలే కాదు. రష్మిక తో ఉన్నవి బాబి డియోల్ తో కనిపించినవి ఇలా ప్రతి షార్ట్ లోను ఫాదర్ ఎమోషన్ ని డైరెక్టర్ చూపించారు.
అర్జున్ రెడ్డి రీమేక్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ఇది. అమ్మాయిని మనసారా ప్రేమించిన అర్జున్ రెడ్డిని సైకిక్ లవ్ అన్నారు. ఇప్పుడు యానిమల్ సినిమాలో తండ్రి మీద కొడుకు చూపించే ప్రేమ కూడా అలాగే కనిపిస్తుందని కొందరు అంటున్నారు. సందీప్ రెడ్డి మార్క్ ప్రేమ ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లో రణబీర్ కపూర్ ని ఫుల్ యాక్షన్ గా చూపించారు. తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకుగా రణ్బీర్ కపూర్ ని దర్శకుడు చూపించారు. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.