Rashi Khanna : అతని కోసమే రాశి ఖన్నా ఆ దేశం వెళ్ళిందా ?

Advertisement

Rashi Khanna : టాలీవుడ్ లో ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాతో ఎంట్రీ వచ్చింది రాశిఖన్నా. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా హిందీలో ‘ ఫర్జీ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచినట్లుగా కనిపిస్తుంది.

Rashi Khanna go to foreign
Rashi Khanna go to foreign

ఇక రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటీవల బొద్దుగా ఉన్న ఈ బొమ్మ ఇప్పుడు స్లిమ్ గా తయారై ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే తాజాగా రాశీఖన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా వెకేషన్ లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Rashi Khanna Latest Photoshoot Gold shining Dress
Rashi Khanna Latest Photoshoot Gold shining Dress

ప్రస్తుతం రాశికన్నా ప్యారిస్, నెదర్లాండ్లో పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఫోటోలో గ్రీన్ కలర్ టీ షర్టు, బ్లాక్ ప్యాంట్, షూస్ వేసుకొని స్టైలిష్ లుక్ లో కనిపించింది. దీంతోపాటు గ్లాస్సెస్ ధరించి అదిరిపోయే లుక్ ఇచ్చింది. మరొక ఫోటోలో రెడ్ జాకెట్, బ్లాక్ ప్యాంట్, షూస్ వేసుకొని స్టైలిష్ లుక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు రాశికన్నా ఫోటోలను చూసి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రాశిఖన్నా సో బ్యూటిఫుల్ అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Advertisement
Advertisement