
rashm gowtam special post on ratan tata
rashm gowtam : బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ‘గుంటూరు టాకీస్’తో పాటు పలు సినిమాల్లోనూ నటించిన రష్మి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. మూగ జీవాలకు ఫుడ్ సప్లై చేస్తూ మానవత్వాన్ని చాటుకుంది రష్మి. వీధికుక్కలపై ప్రేమానురాగాలు చూపుతూ కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో వాటికి ఆహార పదార్థాలు అందజేసింది. ఇకపోతే పలు షోస్‌లో యాంకర్‌గా రష్మి తన మాటలతో ఆకట్టుకుంటోంది. తాజాగా తన మనసులో మాట బయట పెట్టేసింది రష్మి. తను ప్రేమించే వ్యక్తికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ వివరాల్లోకెళితే..
rashm gowtam special post on ratan tata
ఇటీవల స్ట్రీట్ డాగ్స్‌పై హ్యూమానిటీ చూపించిన సంఘటనకు సంబంధించిన పోస్ట్ ఒకటి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్టు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు రతన్ టాటాను అభినందించారు. ఈ క్రమంలోనే రతన్ టాటా పోస్టుపైన రష్మి స్పందించింది. సదరు పోస్టులో భారీ వానలో తడుస్తున్న ఓ పర్సన్ గొడుగుతో నిలబడి ఉన్నాడు.
rashm gowtam special post on ratan tata
rashm gowtam : నడి రోడ్డు మీద అలా అంబరిల్లా పట్టుకుని తన గమ్యస్థానానికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న సదరు వ్యక్తి పక్కకు ఓ డాగ్ వచ్చి, ఆయన గొడుగు కింద నిలబడింది. ఈ క్రమంలో కుక్కను తరమకుండా అలానే నిల్చొని, డాగ్‌కు కూడా గొడుగు పట్టి దానిపై వర్షపు చినుకులు ఒక్కటి కూడా పడకుండా చూసుకున్నాడు సదరు వ్యక్తి. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంకా ఇటువంటి మంచి వ్యక్తులున్నారు అని రతన్ టాటా కామెంట్స్ చేశాడు.
rashm gowtam special post on ratan tata
ఈ నేపథ్యంలో రతన్ టాటా చేసిన పోస్టు చూసి రష్మి స్పందించింది. అంతటి గొప్ప వ్యక్తి ఇటువంటి సాధారణ విషయాల పట్ల స్పందించడం చాలా గొప్ప విషయమని, వీధి కుక్కల గురించి సామాన్యుడు చేసిన పనిని రతన్ టాటా ప్రశంసించడం చాలా మంచి విషయమని రష్మి పేర్కొంది. రతన్ టాటా అంటే తనకు చాలా అభిమానమని, ఆయన్ను తాను ప్రేమిస్తున్నానని ఈ సందర్భంగా రష్మి గౌతమ్ చెప్పింది.
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
This website uses cookies.