Rashmi Gautam : వామ్మో రష్మీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ వేసిందిగా.. పెళ్లికి కాదు దానికి వస్తాడని చెబుతున్న యాంకర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : వామ్మో రష్మీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ వేసిందిగా.. పెళ్లికి కాదు దానికి వస్తాడని చెబుతున్న యాంకర్

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో నెంబర్ వన్‌ ప్లేస్‌లో వెలుగొందుతోంది జబర్ధస్త్ షో. ఈ షో ఇంతగా సక్సెస్ కావ‌డానికి కమెడియన్లు చేస్తున్న స్కిట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎంతో మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు ఉన్నా.. వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో హైపర్ ఆది ఒకడు. చాలా కాలంగా ఈ షో విజయంలో భాగం అవుతోన్న అతడు.. అదిరిపోయే పంచులతో సత్తా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 October 2022,12:30 pm

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో నెంబర్ వన్‌ ప్లేస్‌లో వెలుగొందుతోంది జబర్ధస్త్ షో. ఈ షో ఇంతగా సక్సెస్ కావ‌డానికి కమెడియన్లు చేస్తున్న స్కిట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎంతో మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు ఉన్నా.. వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో హైపర్ ఆది ఒకడు. చాలా కాలంగా ఈ షో విజయంలో భాగం అవుతోన్న అతడు.. అదిరిపోయే పంచులతో సత్తా చాటుతూ వ‌స్తున్నాడు. అంద‌రి మీద పంచ్‌లు వేస్తూ అల‌రిస్తున్నాడు. ఇక ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌ల‌ని హోస్ట్ చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్ కూడా త‌న దైన శైలిలో వినోదం పంచుతూనే ఉంది. టైం వ‌చ్చిన‌ప్పుడు డ‌బుల్ మీనింగ్ డైలాగులు పేలుస్తుంటుంంది.

తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో తాగుబోతు ర‌మేష్ ఓ స్కిట్ చేస్తాడు. ఇందులో ర‌మేష్ కొత్త పెళ్లైంది ఎక్స్ పీరియెన్స్ ఎలా అని అడ‌గ్గా, దానికి కృష్ణ భ‌గవాన్… న‌న్ను పిలువు నేను చెబుతా అంటాడు. ద‌యచేసి మీరు పెళ్లికి రావ‌ద్దు అని ర‌మేష్ అంటాడు. అప్పుడు వెంటనే క‌లుగజేసుకున్న ర‌ష్మీ దానికి వ‌స్తాడంటూ డబుల్ మైనింగ్ డైలాగ్ వ‌చ్చేలా ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. ఇది చూసి బాబోయ్ ర‌ష్మీ కూడా త‌గ్గ‌ట్లేదుగా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ర‌ష్మీ డైలాగ్‌కి ఇంద్ర‌జ‌, కృష్ణ భ‌గ‌వాన్ కూడా తెగ న‌వ్వేశారు.

Rashmi Gautam about Double Meaning Dialogues in Jabardasth

Rashmi Gautam about Double Meaning Dialogues in Jabardasth

Rashmi Gautam : బాబోయ్ దారుణం..

ఈ ఎపిసోడ్‌లో హైపర్ ఆది ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులను వాడుతూ స్కిట్ చేసినట్లు కనిపించింది. ఆయ‌న‌కు తోడుగా మిగ‌తా వారు సైతం త‌గ్గేదే లే అన్న‌ట్టు పంచ్‌లు విసిరారు. ఇక లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై రష్మీ హవా నడుస్తోంది యాంకర్ రష్మీ. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన ఫోటో షూట్స్ ద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. రష్మీ… ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ షోతోనే ఆమెకు పాపులారిటీ లభించింది. బుల్లితెరపై తెగ హంగామా చేస్తూ తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది