rashmi gautam : పండుగ రోజు కూడా పాత మొగుడేనా?.. సుధీర్ పరువుతీసిన రష్మి
rashmi gautam బుల్లితెరపై రష్మీ rashmi gautam సుధీర్ Sudheer జోడి ఎంతగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇద్దరి మీద చేసిన స్కిట్లు, వేసిన ఈవెంట్ల ప్లాన్లు, చేసిన షోలు ఫుల్లుగా సక్సెస్ అయ్యాయి. ఈ ఇద్దరూ ఉంటే చాలు.. కాన్సెప్ట్ ఏదైనా సరే వర్కవుట్ అవుతుంది. ఈ ఇద్దరి మీద ఇన్ని రోజులు ఎన్నో స్కిట్లు, ఈవెంట్లు వచ్చాయి.
కానీ ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ ఈవెంట్‌ను ముందుకు నడిపించేందుకు వచ్చేశారు. వినాయక చవితి సందర్భంగా చేస్తోన్న ఈవెంట్‌కు రష్మీ సుధీర్ హోస్ట్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వదిలిన ప్రోమో తెగ వైరల్ అయింది. భీమ్లా నాయక్ స్టైల్లో మన సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. వినాయక చవితి ఉంది.. సెలెబ్రేషన్స్ ఎక్కడరా అంటూ లుంగీ కట్టి మరీ వచ్చేశాడు.
పండుగ రోజు కూడా పాత మొగుడేనా?.. సుధీర్ పరువుతీసిన రష్మి rashmi gautam Sudheer
ఇక తాజాగా వదిలిన రెండో ప్రోమోలో అసలు కథను చూపించారు. ఇందులో రోజా వర్సెస్ ఇంద్రజ అనేట్టుంది. రెండు టీంలుగా విడగొట్టేశారు. రోజా ఇంద్రజలు వేసుకున్న పంచ్‌లు, వర్ష ఇమాన్యుయేల్ అడుక్కునే గెటప్పులు అన్నీ ఒకెత్తు అయితే.. రష్మీ సుధీర్ జంట వేసుకున్న పంచ్‌లు మరో ఎత్తు. పండుగ రోజు కూడా పాత మొగుడేనా? అంటూ సుధీర్‌ను ఉద్దేశించి రష్మీ దారుణమైన కామెంట్ చేసింది.
నీ కోసం ఏం మానేయాలి చెప్పు అంటూ సిన్సియర్‌గా రష్మీని సుధీర్ అడిగేశాడు. ముందు ఆ యాంకరింగ్ మానేసేయ్.. ఆ శ్రీదేవీ డ్రామా కంపెనీలో నీ యాంకరింగ్ చూడలేకపోతోన్నాం.. హాయ్ వెల్కమ్ టు శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ దారుణంగా వెక్కిరించింది రష్మి. నీ కోసం యాంకరింగ్ కూడా మానేస్తా.. మరి నాకో మాటివ్వు అని రష్మిని సుధీర్ అడిగాడు. మనసు తప్ప ఇంకేమైనా ఇస్తాను అని సుధీర్‌కు మాటిచ్చింది. అలా మొత్తానికి ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్‌ను ఈ ఇద్దరూ నడిపించబోతోన్నారు.