Rashmi Gautam : రష్మీ పెళ్లి అంటూ రచ్చ.. మారని మల్లెమాల టీం

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 May 2022, 11:00 am

మల్లెమాల టీం తన టీఆర్పీ కోసం వేయని వేషాలు లేవు. బుల్లితెరపై తమ షోలకు టాప్ టీఆర్పీ రేటింగ్స్ రావాలని నానా తంటాలు పడుతుంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలను బాగానే నడిపిస్తుంటుంది. ఇక అన్నింట్లోనూ రొమాంటిక్ ట్రాకులు కంపల్సరీ ఉండాల్సిందే.అలా రష్మీ సుధీర్ ట్రాక్ మీద కొన్నేళ్లుగా షోలను నడిపించారు. స్పెషల్ ఈవెంట్లను కూడా చేశారు. ఆ తరువాత లైన్లోకి కొత్త జంటలు వచ్చాయి. కొన్ని రోజులకు మూలన పడ్డాయి.అయితే రష్మీ సుధీర్ మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌లానే ఉంటుంది. అయితే ప్రతీసారి పెళ్లి నాటకం ఆడుతూ స్కిట్లు, ఈవెంట్లు, ప్రోగ్రాంలు చేస్తుండటంపై మల్లెమాల మీద జనాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆ మధ్య వర్ష, ఇమాన్యుయేల్ పెళ్లి మీద ఈవెంట్ చేయడంతో అందరూ తిరగబడ్డారు. ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి బూటకపు పెళ్లిళ్లు చేసుకుంటూ టీఆర్పీలు కొల్లగొడతారు అంటూ ఓ రేంజ్‌‌లో ఏకిపారేశారు. ఇలా పెళ్లిళ్లు కాదు ఇక శోభనాలు కూడా చేయించు.. దాన్ని కూడా ప్రసారం చేయించు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ తన పైత్యాన్ని వదిలించుకోలేకపోయారు. ప్రోమోలు అంటేనే టీఆర్పీ స్టంట్లు. ప్రోమోలో ఉండేదానికి ఎపిసోడ్‌లో ఉండేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీని పెళ్లి కూతురుగా చూపించారు.

rashmi gautam post viral in social media

Rashmi Gautam As Bride and groom In Extra Jabardasth Promo

అంతే కాకుండా తన పక్కన ఎవరు కూర్చున్నారో చూపించలేదు. మొహానికి పూలదండ వేయించి చూపించారు. మొత్తానికి మళ్లీ ఇదొక కొత్త నాటకం ఆడిస్తూ షోకు టీఆర్పీ రేటింగ్ సాధించుకోవాలని చూస్తున్నారు.అయితే రష్మీ కూడా బాగానే నటించింది. అదేదో నిజమైన పెళ్లి అన్నట్టుగా రష్మీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది గానీ.. ఈ ప్రోమోలో సుధీర్ టీం కనిపించలేదు. అసలే సుధీర్, గెటప్ శ్రీను ఈ మధ్య ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ షోలో కనిపించడమే మానేశారు. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండేట్టుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp