Rashmi Gautam : రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఫుల్ వైరల్ అయింది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ పాట మారుమ్రోగిపోతుంది. కుర్చీ మడత పెట్టి డైలాగ్ ను వాడిన షేక్ పాషా అనే కుర్చీ తాత కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆ కుర్చీ తాత డైలాగుతో ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో ఆయన బాగానే సంపాదించారు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పాటకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ పాట మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. దాన్ని కొట్టి పడేస్తూ సెలబ్రిటీ దాని గురించి ట్వీట్ వేశారు. గుంటూరు కారం సినిమాలోని కూర్చి మడతపెట్టి సాంగ్ లో శ్రీ లీల డాన్స్ ఎంత హైలైట్ అయిందో పూర్ణ డాన్స్ కూడా అంతే హైలెట్ అయింది.
అయితే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. పూర్ణ వేసిన ఆ డాన్స్ బిట్ కోసం ముందుగా యాంకర్ రష్మీ గౌతమ్ ని సినీ మేకర్స్ అడిగారట. అయితే అందుకు రష్మీ ఒప్పుకోలేదు. దీంతో ఆ సాంగ్ కి పూర్ణని తీసుకున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా రష్మీ గౌతమ్ స్పందించారు. ఈ పాట కోసం నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదని, ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తారు అంటూ ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నన్ను అసలు ఎవరూ అడగలేదని, నేను ఎలా రిజెక్ట్ చేస్తాను అని, పూర్ణ చేసిన బిట్స్ అద్భుతంగా ఉన్నాయని, ఆమె కన్నా అంత గ్రేస్ ఫుల్ గా ఎవరూ చేయలేరని, ఇలాంటి వార్తలు వలన నాపై నెగిటివిటీ పెరుగుతుందని, దయచేసి ఇలాంటి వార్తలు నమ్మవద్దు అని రష్మీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇలా రష్మీ తనపై వస్తున్న తప్పుడు వార్తలు పై స్పందించారు. ఇకపోతే రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా ఆమె యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇక సినిమాలలో రష్మీ నటించట్లేదుగా తెలుస్తుంది. ఆ మధ్య అడపా దడపా సినిమాలలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలలో కనిపించడం లేదు. మంచి పాత్ర వస్తే చేస్తానని ఆమె చెబుతున్నారు. ఇక రష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తనపై వస్తున్న తప్పుడు వార్తలు పై కూడా స్పందిస్తూ ఉంటారు. తనపై వచ్చిన ఫేక్ న్యూస్ పై వెంటనే ఖండిస్తుంటారు. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు పుల్ స్టాప్ పెట్టారు. ఇలా తప్పుడు వార్తలు వలన సెలబ్రిటీలపై నెగెటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.