
Prudhvi Raj : రోజా గురించి పవన్ కళ్యాణ్ కి చెప్తే ఏమన్నారంటే.. పృథ్వీరాజ్ ?
Prudhvi Raj : నటుడు పృథ్వీరాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఆయన ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పృధ్వీరాజ్ జనసేన పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కీలక విషయాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సహాయం చేసిన సంగతి తెలిసిందే. రైతులకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన పరిహారం కోసం పోరాడుతూనే తన వంతుగా వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 150 మంది రైతులకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఇప్పటికే ఆయన చాలామందికి అందజేశారు. ఈ క్రమంలోనే చాలామంది పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చారు. ఇక దీనిపై యాక్టర్ పృధ్వీరాజ్ మాట్లాడారు. మేము ఎవరిని దోచుకోవడం లేదు, దాచుకోవడం లేదు. పంచుకోవడం లేదు. అధికారంలో లేము. పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించారు. ఆఖరికి అకిరా నందన్ కోసం దాచిన డబ్బులను కౌలు రైతులకు ఇచ్చారు అని యాక్టర్ పృధ్విరాజ్ వివరించారు. పవన్ కళ్యాణ్ 9 కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళను అడిగి కట్టారు. ఈ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ సాయం చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, రోజా లాంటివారు పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.
వాళ్లకు విమర్శలు చేయడం తప్ప మరేమి చేతకాదు. వాళ్ళ నోరుకు అడ్డుఅదుపు ఉండదు అని అన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 2024లో అదే ఒక్క ఛాన్స్ పవన్ కళ్యాణ్ కు ఇస్తారు. ఏపీ ప్రజలు చాలా మృదు స్వభావం కలిగిన వారు. ముఖ్యంగా మహిళలు, యువత పవన్ కళ్యాణ్ వెనుక ర్యాలీ అవుతారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అని పృధ్విరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని విమర్శించారు. ఆ తర్వాత పెళ్లిళ్ల మీద పడ్డారు. ఎవరేం మాట్లాడినా, ఏం చేసినా జనసేన పార్టీకి 2024లో మంచి విజయం దక్కబోతుంది అని పృధ్విరాజ్ వ్యాఖ్యానించారు.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
This website uses cookies.