Rashmi gautam : నేరుగా ఆ విషయం అడిగిన సుధీర్.. రష్మీ షాకింగ్ రియాక్షన్..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 April 2021, 10:30 am

Rashmi gautam : బుల్లితెరపై రష్మీ సుధీర్ కాంబినేషన్‌కు ఎప్పుడూ ఫ్యాన్స్ ఉంటారు. రష్మీ సుధీర్ గత ఎనిమిదేళ్లుగా తమ కెమిస్ట్రీతో బుల్లితెరపై మ్యాజిక్ చేసేస్తున్నారు. వీరిద్దరి మధ్య కనబడని బంధాన్ని చూపిస్తూ.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష ఇమాన్యుయేల్ కూడా దూసుకుపోతోన్నారు. ఈ జంటకు ఇప్పుడు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తాజాగా వీరు వేసిన స్కిట్‌తో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా పెళ్లి బట్టల్లో వచ్చి ఆశ్చర్యపరిచారు.

కాకి ఎండలో నీళ్లు పెడితే మంచి పెళ్లాం వస్తుందట.. కానీ నువ్ లస్సీ పెట్టినట్టున్నావ్.. అందుకే ఇలాంటి పెళ్లాం వచ్చింది అని ఇమాన్యుయేల్‌పై రోజా కౌంటర్ వేసింది. ఇలా వర్ష ఇమాన్యుయేల్ వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చేసిందని రష్మీ మీద సుధీర్ ఫైర్ అవుతుంటారు. మనది ఎనిమిదేళ్ల బంధం.. నిన్న కాక మొన్న వచ్చారు వాళ్లు.. కానీ వాళ్లు చూడు ఏకంగా పెళ్లి వరకు వచ్చారు.. వారి బస్ డిపోకు కూడా వెళ్లిపోతోందని సుధీర్ ఆవేదన చెందాడు.

Rashmi gautam counter to Sudheer In Extra Jabardasth

Rashmi gautam counter to Sudheer In Extra Jabardasth

Rashmi gautam : నేరుగా ఆ విషయం అడిగిన సుధీర్.. రష్మీ షాకింగ్ రియాక్షన్

మరి మన బస్ ఎప్పుడు డిపోకు వెళ్తుంది. నేను ఇంకా ఎన్ని రోజులు అక్కడే తిరగాలి అని సుధీర్ అడిగేశాడు. ఇక రష్మీ స్పందిస్తూ.. నువ్ ఎన్ని రోజులు బయట అలాగే తిరిగితే అన్ని రోజులు అక్కడే ఉండూ… అసలు నీకు డిపోలోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? అంటూ సుధీర్ మీద రివర్స్ కౌంటర్ వేసింది. మొత్తానికి వర్ష ఇమాన్యుయల్ స్కిట్‌లో ఇలా రష్మీ సుధీర్ స్టోరీ రావడంతో స్కిట్ బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రెండూ జోడీలు జబర్దస్త్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నాయి.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి