Rashmi Gautam : పొట్టి గౌనులో యాంకర్ రష్మీ.. వామ్మో మళ్లీ మొదలెట్టేసిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : పొట్టి గౌనులో యాంకర్ రష్మీ.. వామ్మో మళ్లీ మొదలెట్టేసిందా?

 Authored By prabhas | The Telugu News | Updated on :13 September 2022,7:00 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీ ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌‌కు గురయ్యేది. ఆమె భాష, వస్త్రాధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. కనీసం తెలుగు చదవడం, రాయడం, పలకడం రాని వారు కూడా తెలుగులో యాంకరింగ్ చేస్తున్నారు.. అవకాశాలు ఇస్తున్నారంటూ నానా రకాలుగా ఆమె మీద కామెంట్లు చేసేవారు. కానీ క్రమేనా రష్మీ డెడికేషన్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆమె మంచి తనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి.

ఇప్పుడు ఆమెకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లోనే ఎక్కువగా క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో రష్మీ వేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంటుంది. ఆమె మూగ జీవాల కోసం పాటు పడుతుండటం, వాటి సంరక్షణ కోసం తాపత్రయ పడుతుండటం చూసి అందరూ కనెక్ట్ అవుతుంటారు. అయితే రష్మీ మాత్రం ఈ మధ్య ఎక్స్‌పోజింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకప్పుడు అయితే డబ్బు కోసం ఎలాంటి పాత్రలు వచ్చినా చేసింది.

Rashmi Gautam Dressing In Sridevi Drama Company

Rashmi Gautam Dressing In Sridevi Drama Company

డబ్బు అవసరం అని, డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేశానంటూ అందరి ముందే ఒప్పేసుకుంది రష్మీ. ఆలీతో సరదాగా షోలో మాట్లాడుతూ ఈ విషయాల మీద స్పందించింది. బుల్లితెరపై వచ్చే షోల్లోనూ ఒకప్పుడు రష్మీ తన అందాలను ప్రదర్శించేది. కానీ కొన్ని రోజులుగా వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. నిండైన వస్త్రాలతోనే కనిపించేది. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం రష్మీ మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మోకాళ్ల పైకి గౌను ధరించింది. పొట్టి గౌనులో ఇలా కనిపించేసరికి అందరూ అవాక్కవుతున్నారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది