Rashmi Gautam emotional in the show
Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పలు జంటలు చేసే సందడి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. కామెడీ షో సాక్షిగా రష్మీ-సుధీర్ అనే బుల్లితెర ప్రేమ జంట మంచి వినోదాన్ని పంచుతుంది. క్రేజీ లవ్ బర్డ్స్ గా వాళ్ళు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్- వర్ష అదే స్థాయిలో లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మూడో జంటగా జోర్దార్ సుజాత-రాకింగ్ రాకేష్ అవతరించారు. వారి మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తుంది. అనేక బుల్లితెర షోలలో వీరిద్దరూ ప్రేమికులుగా షోలు చేస్తున్నారు.
తాజా ఎపిసోడ్ లో సుజాత రాకేష్‌లకి సంబంధించి రోజా ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. మీ ఇద్దరికీ చిన్న గొడవొచ్చి రాకేష్ నిన్ను వదిలి వేరే అమ్మాయితో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి?.. అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా సుజాత.. రాకేష్ వేరే అమ్మాయితో వెళితే నా ప్రాబ్లం లేదు. ఆయనతో వెళ్లిన అమ్మాయి రాంగ్ పర్సన్ కాకూడదు. ఒకవేళ రాకేష్ తన సంతోషం కోసం వేరే అమ్మాయితో వెళ్లినా నాకు ఓకె. తన సంతోషం కోసం రాకేష్ ని వదిలేస్తా అంటూ ఎమోషనల్ అయ్యింది.
Rashmi Gautam emotional in the show
సుజాత మాటలకు రాకేష్ కన్నీరు పెట్టుకున్నారు. జడ్జెస్ తో పాటు సెట్ లో ఉన్న కమెడియన్స్ షాక్ అయ్యారు. రష్మీ మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. కాగా కారణం ఏమిటో తెలియదు కానీ రష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు. లేటెస్ట్ ఎక్ట్రా జబర్దస్త్ ప్రోమో చివర్లో రష్మీ నిరవధికంగా ఏడవడం చూపించారు. దీంతో రష్మీ అంతలా ఏడవడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరి ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ తర్వాత పూర్తి క్లారిటీ రానుంది. ఏది ఎలా ఉన్నా కూడా ప్రోమోకి సంబంధించి విషయం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి క్లారిటీ రావాలంటేఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.