viral video: ప్రతిరోజూ ఇంటర్నెట్ లో ఎన్నో భిన్న రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన జంతువులు, పక్షులకు సంబంధించినవే. కొన్ని వీడియోల్లో జంతువులు పోట్లాడటం చూస్తుంటాం. వేటాడటమూ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని జంతువులు జాతివైరం మరిచి స్నేహంగా కలిసి జీవిస్తుంటాయి. ఇలా చూసినప్పుడు మూచ్చటేస్తుంటుంది. ఇట్లాంటి వీడియోలు సోషల్ మీడియాలో లక్షల్లో ఉంటాయి.నాగు పాములు ఎక్కువగా ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు చిట్టడవులు, పంట పొలాలు.
కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పల్లెటూళ్లు, పట్టణాలలో కూడా కనిపిస్తుంటాయి.సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు కనిపిస్తే ఓ పట్టాన వదలవు. వాటిని మింగకుండా వదలవు. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాయి. పాత పెంకుటిళ్ల చూర్లలో ఎలుకల కోసం పాములు ఎక్కువగా తీరుగుతుంటాయి. ఎలుకలను తింటూ అక్కడే కదలలేని స్థితిలో పట్టుబడుతుంటాయి. ఇలా మనం చాలనే చూసుంటాం. కానీ ఇక్కడ ఎలుకలు, ఓ కప్ప పామును పరుపులా మార్చుకుని తిరుగుతున్నాయి.ఈ వీడియోలో పాము ఒక కప్పను, రెండు ఎలుకలను తన వీపు పైన కుర్చోబెట్టుకొని సవారీ చేస్తూ కనిపించింది.
ఒక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా, ఒక పాము, ఓ కప్ప, రెండు ఎలుకలు ఓ వాటర్ కంటైనర్‌లో చిక్కుకున్నాయి. పాము కావాలనుకుంటే ఆ కప్పను, ఎలుకలను ఆహారంగా మార్చుకోవచ్చు.. కానీ ఆ పాము కంటైనర్‌లో నిండిన నీటి నుండి కప్ప, ఎలుకలప్రాణాలు రక్షించింది. నీటిలో మునిగి పోకుండా కప్ప, ఎలుకలు పాము వీపుపైకి ఎక్కి కూర్చున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకేసారి ఎలుకలు, కప్పు చిక్కినప్పటికీ పాము చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పలు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఓ కామెంట్ పడేయండి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.