Rashmi Gautam : బుల్లితెరపై సందడి చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్స్‌లో ఒకరు రష్మి గౌతమ్. ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్స్ కు యాంకర్‌గా వ్యవహరిస్తూ టాలీవుడ్ బిజియెస్ట్ యాంకర్‌గా రష్మి గౌతమ్ కొనసాగుతోంది. హాట్ యాంకర్‌గా ఉంటూ టైమింగ్‌ను బట్టి పంచులు వేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకునే రష్మిలో మరో కోణం కూడా ఉంది.మూగజీవుల పట్ల ప్రేమ చూపే రష్మి గౌతమ్ వాటికి ఫుడ్ సర్వ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటుంది. కొవిడ్ కట్డడికి విధించిన లాక్ డౌన్ టైంలో రష్మి తన సొంత డబ్బులతో ఫుడ్ రెడీ చేయించి మరీ తీసుకెళ్లి మూగజీవాలు అయిన స్ట్రీట్ డాగ్స్‌కు పెట్టింది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు వాటికి ఫుడ్ పెట్టాలని సూచించింది.
ఈ క్రమంలోనే మూగ జీవాలపై వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి యాంకర్ రష్మి ఫైర్ అయింది. మూగ జీవాలకు నోరు ఉండదని, అవి ఆకలి అవుతుందని చెప్పలేవని పలు సందర్భాల్లో పేర్కొన్న రష్మి.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి భావోద్వేగానికి గురైంది. సదరు వీడియోలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఓ వీధి కుక్కను కట్టేసి మరీ కొట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్‌లో ఈ ఘటన జరిగింది. సుమారు అరగంట పాటు వీధికుక్కను కొడుతుంటే పక్కనున్న జనాలు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మి.
నోరులేని మూగ జీవిపై జరుగుతున్న దాడిని చూస్తూ పలువురు అలానే ఉండిపోవడాన్ని తప్పుపట్టింది. ఈ ఘటనతో మానవ జాతికి ఈ భూమ్మీద ఉండే అర్హత లేదంటూ భావోద్వేగానికి గురైంది రష్మి. రష్మి గౌతమ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలోనూ రష్మి నోరు లేని మూగ జీవాల పట్ల హింసించే వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నోరు లేని మూగ జీవాలకు ఫుడ్ అందించాలని కోరుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిన రష్మి.. సామాజిక అంశాలపైన కూడా స్పందిస్తూ తనకంటూ ఓ విలక్షణతను చాటుకుంటోంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.