Rashmi Gautam : మనకు భూమ్మీద ఉండే అర్హత లేదు.. ఆ వీడియో చూసి రష్మి గౌతమ్ ఎమోషనల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : మనకు భూమ్మీద ఉండే అర్హత లేదు.. ఆ వీడియో చూసి రష్మి గౌతమ్ ఎమోషనల్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 October 2021,7:00 am

Rashmi Gautam : బుల్లితెరపై సందడి చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్స్‌లో ఒకరు రష్మి గౌతమ్. ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్స్ కు యాంకర్‌గా వ్యవహరిస్తూ టాలీవుడ్ బిజియెస్ట్ యాంకర్‌గా రష్మి గౌతమ్ కొనసాగుతోంది. హాట్ యాంకర్‌గా ఉంటూ టైమింగ్‌ను బట్టి పంచులు వేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకునే రష్మిలో మరో కోణం కూడా ఉంది.మూగజీవుల పట్ల ప్రేమ చూపే రష్మి గౌతమ్ వాటికి ఫుడ్ సర్వ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటుంది. కొవిడ్ కట్డడికి విధించిన లాక్ డౌన్ టైంలో రష్మి తన సొంత డబ్బులతో ఫుడ్ రెడీ చేయించి మరీ తీసుకెళ్లి మూగజీవాలు అయిన స్ట్రీట్ డాగ్స్‌కు పెట్టింది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు వాటికి ఫుడ్ పెట్టాలని సూచించింది.

rashmi gautam emotional on Video

rashmi gautam emotional on Video

Rashmi Gautam : అమానుష దాడిని జనాలు చూస్తుండి పోయారు..

ఈ క్రమంలోనే మూగ జీవాలపై వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి యాంకర్ రష్మి ఫైర్ అయింది. మూగ జీవాలకు నోరు ఉండదని, అవి ఆకలి అవుతుందని చెప్పలేవని పలు సందర్భాల్లో పేర్కొన్న రష్మి.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి భావోద్వేగానికి గురైంది. సదరు వీడియోలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఓ వీధి కుక్కను కట్టేసి మరీ కొట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్‌లో ఈ ఘటన జరిగింది. సుమారు అరగంట పాటు వీధికుక్కను కొడుతుంటే పక్కనున్న జనాలు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మి.

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

నోరులేని మూగ జీవిపై జరుగుతున్న దాడిని చూస్తూ పలువురు అలానే ఉండిపోవడాన్ని తప్పుపట్టింది. ఈ ఘటనతో మానవ జాతికి ఈ భూమ్మీద ఉండే అర్హత లేదంటూ భావోద్వేగానికి గురైంది రష్మి. రష్మి గౌతమ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలోనూ రష్మి నోరు లేని మూగ జీవాల పట్ల హింసించే వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నోరు లేని మూగ జీవాలకు ఫుడ్ అందించాలని కోరుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిన రష్మి.. సామాజిక అంశాలపైన కూడా స్పందిస్తూ తనకంటూ ఓ విలక్షణతను చాటుకుంటోంది.

Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee

Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది