Rashmi Gautam : వామ్మో చితక్కొట్టేసిన రష్మీ.. ఆ పని చేయలేక భాస్కర్‌కు చెమటలు
Rashmi Gautam : యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏం చేసినా అభిమానించే వారు ఉన్నారు. జబర్దస్త్ షోలో చాలా కాలంగా యాంకర్‌గా కొనసాగుతుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నా జబర్దస్త్‌ను మాత్రం ఒదులుకోవడం లేదు. చాలా ఎనర్జీతో ఉండే స్టేజ్ మీద.. తనదైన శైలిలో రెచ్చిపోతుంది. జబర్దస్త్‌లోనే కాదు.. ఆమె ఢీలో కూడా తనదైన మార్క్ వేసింది. గున్న గున్న మామిడి.. సాంగ్‌కు తనదైన స్టెప్పులతో జనాలను అలరించింది. తన సిగ్నేచర్ మూమెంట్‌లా మార్చేసుకుంది.
అయితే ఎక్స్‌ట్రా యాంకర్‌గా ఉండే రష్మీ అప్పుడప్పుడు స్కిట్స్‌లో కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కొందరు టీమ్ లీడర్స్‌తో చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే తాజాగా భాస్కర్ స్కిట్‌లో రష్మీ సందడి చేసింది. తొలుత భాస్కర్, ఫైమాతో కలిసి స్టేజ్ మీదకు వస్తాడు. ఇద్దరు కలిసి.. గుసగుసలే గున్నా మామిళ్ళు సాంగ్‌కు డ్యాన్స్ చేస్తారు.

Rashmi Gautam energetic dance With bullet bhaskar
Rashmi Gautam : డ్యాన్సులతో దుమ్ములేపిన రష్మీ.
అప్పుడు అక్కడకు వచ్చిన రష్మీ.. ఏం జరుగుతుంది ఇక్కడ.. దీన్ని స్టెప్ అంటారా..?.. స్టెప్పు వేస్తే దెబ్బకు హాస్పిటల్‌లో 4 లక్షలు కట్టాలి (భాస్కర్‌కు గతంలో జరిగిన ఇన్సిడెంట్‌ను ఉద్దేశించి) అని అంటుంది. ఆ తర్వాత భాస్కర్, ఫైమాలతో కలిసి.. మళ్లీ అదే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తుంది. ఇందులో భాగంగా మొక్కాలపై కూర్చుని కూడా రష్మీ యాక్టివ్‌గా స్టెప్స్ వేస్తుంది. అయితే భాస్కర్‌కు మాత్రం ఆ స్టెప్స్ వేయలేక చెమటల పట్టాయి. చివరకు రష్మీ ఒకే బాయ్ అని వెళ్లిపోతుంది.