Rashmi Gautam : బుల్లితెరపై ఇప్పుడు యాంకర్ల హంగామా నడుస్తోంది. షోలు ఎక్కువయ్యాయ్.. వాటికి సరిపోయే యాంకర్లు తక్కువయ్యారు. అనసూయ వెళ్లిపోయింది. జబర్దస్త్ షోలో యాంకర్ స్థానం ఖాళీగా ఉంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి సుధీర్ వెళ్లిపోయాడు.అక్కడ స్థానం ఖాళీ అవ్వడంతో రష్మీతో భర్తీ చేశారు. సుధీర్ స్థాయిలోనే రష్మీ కూడా ఆకట్టుకుంటోంది. రష్మీ యాంకర్‌గా అక్కడ బాగానే సెట్ అయిపోయింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో కోసం కొత్త యాంకర్‌ను వెతికే పనిలో మల్లెమాల టీం పడింది. మొన్నటి వరకు జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరా? అని ఆలోచించారు. ప్రోమోను కూడా బాగానే వదిలారు. పల్లకిలో తీసుకొచ్చారు.
ఆ కొత్త యాంకర్ ఎవరా? అనే ఉత్సాహాన్ని అందరిలో నింపారు. చివరకు ఉసూర్‌మనిపించారు. రష్మీనే యాంకర్‌గా తీసుకున్నారు. యాంకర్ రష్మీతోనే షోను కొంత కాలం నడిపిద్దామని ఆలోచనలో ఉన్నారట. అందుకే ఇప్పుడు అయితే రష్మీని తీసుకున్నారట. ఆ తరువాత మళ్లీ కొత్త యాంకర్ దొరికితే.. రష్మీని పంపించేస్తారట. ఈ మేరకు రష్మీ ఓ పోస్ట్ కూడా వేసింది. మళ్లీ జబర్దస్త్ షోకు యాంకర్‌గా రావడం ఆనందంగా ఉందని, ఇలా తనకు గ్రాండ్‌గా వెల్కమ్ ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పింది. కొన్ని రోజులు ఇలా నన్ను భరించండి.. కొత్త యాంకర్ దొరికే వరకు నేను వస్తాను.. దయచేసి నన్ను భరించండి అంటూ చెప్పుకొచ్చింది.
మొత్తానికి రష్మీ ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లో ఆమె కనిపిస్తుంటుంది. అందుకే తనను భరించండి అని అలా వేడుకుంది. మొత్తానికి రష్మీని అయితే అన్ని షోలకు వాడేసుకుంటుంది మల్లెమాల. మరి ఈ జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ ఎవరా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే మారింది. యాంకర్‌గా మంజూష వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఇక బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి పేరు కూడా పరిశీలనలో ఉందని టాక్ వచ్చింది. కానీ ఎవరు యాంకర్‌గా వస్తారో చూడాలి.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.