Rashmi : పెళ్లి పీట‌లు ఎక్కిన రష్మి .. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Updated on: April 26, 2022, 2:06 pm

Rashmi : ర‌ష్మీ అంటే మ‌నందరికి గుర్తొచ్చే పేరు జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ర‌ష్మీ గౌత‌మ్. ఈ అమ్మ‌డు టీవీ షోస్, సినిమాలు, గ్లామ‌ర్ షోతో నానా ర‌చ్చ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డికి సంబంధించి ఏ విష‌య‌మైన క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది.తాజాగా ర‌ష్మీ పెళ్లి అంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇది విని అంద‌రు షాక్ అయ్యారు. అస‌లు విష‌యం ఏంటంటే కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్‌ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రియుడు నిఖిల్‌ భార్గవ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులో ఏప్రిల్‌ 25న వీరి వివాహం జరిగింది.

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఇటీవల రష్మి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ముందుగానే వివరించింది. ‘నిఖిల్‌ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో పని చేస్తాడు. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఓ ఈవెంట్‌లో మేమిద్దరం కలిశాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారాము. అలా ఒకరినొకరం ఇష్టపడ్డాం. ముందు నిఖిల్‌ ప్రపోజ్‌ చేశాడు, నేనూ ఓకే చెప్పాను. లాక్‌డౌన్‌లో మేమిద్దం కలిసి ఆహారపొట్లాలు కూడా పంచాము. ఒక నటిగా పెళ్లయ్యాక నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిఖిల్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పుకొచ్చింది.

Rashmi marriage in topic now

Rashmi marriage in topic now

Rashmi : పెళ్లిలో ట్విస్ట్..

రష్మి కన్నడ బుల్లితెరపై మనసెల్ల నేనే అనే సీరియల్‌లో కథానాయికగా నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ధారావాహిక నుంచి తప్పుకుంది. ఇది ర‌ష్మీ అస‌లు క‌థ‌. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం ర‌ష్మీ గౌత‌మ్ పెళ్లి కూడా జ‌రిగిందంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం​ సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్‌ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp