
Sreemukhi : పోనీలే పక్కన నిలుచుంటే పబ్లిక్‌లో చేయి పట్టుకొని ఐలవ్ యూ చెప్పాడే.. చాచి కొట్టిన శ్రీముఖి
Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘పటాస్’ కామెడీ షోతోలైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత వైవిధ్యమైన షోలతో స్టార్ యాంకర్‌గా మారింది.మొదట ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఆ తర్వాత వచ్చిన ‘క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలోను హీరోయిన్‌గా చేసింది. ఈ రెండు చిత్రాలు శ్రీముఖికి కలిసి రాలేదు. అయితే జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, జెంటిల్ మెన్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలలోనటించి మెప్పించింది. అయితే శ్రీముఖి సినిమాల కన్నా కూడా టీవీ షోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
అయితే తాజాగా శ్రీముఖి ఓ యంగ్ హీరో చెంప పగలగొట్టడం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఇది సినిమా ప్రమోషన్‌లో భాగంగానే జరిగినట్టు తెలుస్తుంది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రతో ప్రేక్షకులని పలకరించిన పార్వతీశం తాజాగా మార్కెట్ మహాలక్ష్మి అనే చిత్రం చేశాడు.ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మార్చి 29న మూవీ విడుదల చేసే ప్లాన్ చేయగా, ఇందులో భాగంగానే స్టార్ యాంకర్ శ్రీముఖితో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది.
Sreemukhi : పోనీలే పక్కన నిలుచుంటే పబ్లిక్‌లో చేయి పట్టుకొని ఐలవ్ యూ చెప్పాడే.. చాచి కొట్టిన శ్రీముఖి
హీరో పార్వతీశం శ్రీముఖి వద్దకు వెళ్లి.. మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ అని చెప్పడంతో శ్రీముఖి అతడి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇక అతడు వెళ్లిపోతుంటే పిలిచి.. మార్కెట్ మహాలక్ష్మి ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతూ వార్నింగ్ ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక మార్కెట్ మహాలక్ష్మీ చిత్రం విషయానికి వస్తే ఇందులో పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. జబర్ధస్త్ అవినాష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం టాప్ యాంకర్ శ్రీముఖి తనవంతు సహకారం అందించారు…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.