Rashmi gautam: దాదాపు 9ఏళ్ళుగా బుల్లితెర మీద రష్మీ గౌతమ్ – సుధీర్‌ల జంటను చూస్తూనే ఉన్నాము. ఈ కపుల్ కాంబినేషన్‌లో వస్తున్న జబర్దస్త్, ఢీ
డాన్స్ షోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ షోస్‌లో ఎంతమంది ఉన్నా ఫోకస్ మాత్రం ఎప్పుడూ రష్మీ – సుధీర్‌ల మీదే ఉంటుంది. ఇద్దరినీ చూస్తుంటే సంబరపడే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు రష్మీ – సుధీర్‌లు పెళ్ళి చేసుకుంటారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఓ సారి షోలో భాగంగా రష్మీ – సుధీర్‌ల పెళ్ళి తంతు జరిగింది.
rashmi-gautam-sudheer marriage hints are given by roja, indraja
ఇది చూసి నిజంగా రష్మీ – సుధీర్‌లకి పెళ్ళైపోయిందా అని షాకయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అబ్బా ఎన్నాళ్ళకి అని సంబరపడిన వాళ్ళు ఉన్నారు. షోలో భాగంగా ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా ఒక్కసారి అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమగా లుక్స్ ఇచ్చుకుంటే చాలూ టీఆర్పీ అలా పెరిగిపోతుంది. వారికెలా ఉంటుందో గానీ అటు సుధీర్ పక్కన ఇంకెవరిని చూసినా ఇటు రష్మీ పక్కన మరెవరిని చూసిన ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు. అంతగా వీరంటే అభిమానుల్లో అభిమానం ఊహించని విధంగా పెరిగిపోయింది.
అయితే తాజాగా రష్మీ – సుధీర్‌లను రోజా ..మీరు ఎంత చక్కగా ఉన్నారో నిజంగా మీరు పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు. దీనికి ఇంద్రజ కూడా రియాక్ట్ అవుతూ మీరిద్దరు ఒకటైతే నిజంగా బావుంటుందని చెప్పారు. వీరు ఇలా చెప్పడానికి కారణం ఉంది. వినాయకచవితి పండుగ సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాం రాబోతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో రష్మీ – సుధీర్‌ల జర్నీ సక్సెస్‌ఫుల్‌గా 9 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. దీనిని గుర్తు చేసుకుంటూ రష్మీ ఓ మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. అలాగే సుధీర్ కూడా ఇచ్చాడు. ఇది అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంలోనే రోజా, ఇంద్రజ రష్మీ – సుధీర్‌ల పెళ్ళి విషయంలో రియాక్ట్ అయ్యారు. చూడాలి మరి నిజంగా వీరిద్దరు మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారా లేదా. ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులైతే రష్మీ – సుధీర్ పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.