మెదక్ జిల్లాలోని అధికార పార్టీ సర్పంచ్‌లు ఆ పార్టీకి చెక్‌పెట్టెందుకు సన్నమద్దయ్యారు.. అధికార పార్టీలో గుర్తింపు లేకపోవడం మరోవైపు చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున సర్పంచ్‌లు కాంగ్రేస్ పార్టీతోపాటు ఇతర పార్టీలకు జంప్ అయ్యేందుకు రెఢి అయినట్టు సమాచారం. అసలే సర్పంచ్‌లు.. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వారిదే భాద్యత.. ఖాజానాలో డబ్బులు లేకున్నా.. అప్పులు చేసి మరి అభివృద్దికి బాటలు వేస్తారు.. అయితే ఆ అప్పుల అభివృద్దే సర్పంచ్‌ల పాలిట శాపంగా మారుతోంది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక .. తమ రాజకీయ భవిష్యత్‌కోసం వెతుకుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో ఉన్నా తమకు న్యాయం జరగడం లేదంటూ.. పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా తయారైంది. తాజాగా ఈ నేపథ్యంలోనే కొంతమంది సర్పంచ్‌లు తాము చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పార్టీ మారేందుకు సన్నద్దమయ్యారు. గతంలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారు, స్వంత పార్టీలో గెలిచిన వారు సైతం ఇదే బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మించాలని గ్రామ సర్పంచ్ లకు ఆదేశాలు జారీచేసంది. యుద్దప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని సర్పంచ్‌లపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో వైకుంఠదామాలు పూర్తికాగా, వాటికి సంబంధించి ఇంకా బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో వీటిని నిర్మించేందుకు ముందుకు వచ్చిన పలువురు సర్పంచ్‌లు కాట్రాక్టర్లుగా మారారు.
వైకుంఠదామాల నిర్మాణంకోసం సొంత నిధులను వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే వాటి నిర్మాణం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా.. బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో కొంతమంది ఆందోళన బాట పట్టారు. బిల్లుల కోసం అధికారులు, నేతల చుట్టు తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.. ఈ క్రమంలోనే సర్పంచ్‌లు పార్టీ మారి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. మెదక్ జిల్లాలోని అక్కన్నపేట్ మండలంలో పలువురు సర్పంచ్ పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారు.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పంజుకోవడంతో ఆ పార్టీలోకి వెళ్లేందుకు సన్నద్దం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొంతమంది సర్పంచులు గజ్వేల్ కాంగ్రెస్ దళిత దండోరా సభలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. కాగా మండలంలోని 32 మంది సర్పంచ్‌లు ఉండగా అందులో 28 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే..
తాజాగా సుమారు 21 మంది సర్పంచులు అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు రెఢీ అయినట్టు సమాచారం. మరికొంతమంది కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లెందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సర్పంచ్‌ల పార్టీ మార్పు మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ సర్పంచ్ ఉదయం సర్పంచ్ విధులు నిర్వహిస్తూ రాత్రి పూట వాచ్‌మెన్‌గా చేస్తున్న సంఘటన వెలుగు చూసింది, దీంతో ఆ సర్పంచ్ చేసిన పనుల బిల్లులు మొత్తం విడుదల అయిన పరిస్థితి కనిపించింది. కాగా అభివృద్ది పనుల కోసమే సొంత స్థలం కూడా అమ్ముకోవడం కొసమెరుపు. ఇలాంటి సంఘటనలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. దీంతో అవకాశం ఇచ్చిన పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు. మరి దీనిపై అధికారపార్టీ ఏం చేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది.
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
This website uses cookies.