Anasuya : అనసూయకు ఎసరు పెట్టనున్న రష్మి గౌతమ్!.. ఆ షోలో ఇక రంగమ్మత్త కష్టమే?
Anasuya : బుల్లితెరపై ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు, స్పెషల్ షోలంటూ రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కానీ యాంకర్లు మాత్రం కొత్తగా ఫేమస్ అవ్వడం లేదు. సుమ, రష్మీ, అనసూయ వంటి వారి చుట్టే తిరుగుతోంది. అయితే ఇందులో సుమ స్థానం, స్థాయి రెండూ వేరే. ఇక అనసూయ, రష్మీల మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ ఉంటుంది.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండుగా చీల్చేందుకు వీరు కూడా ఓ ముఖ్య కారణమే. అయితే జబర్దస్త్ షోకు యాంకర్‌గా అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు యాంకర్‌గా రష్మీ బాగానే నెట్టుకొస్తున్నారు. కానీ ఈ వారంలో అనసూయ బదులు రష్మీ కనిపించింది. అనసూయ కంటే రష్మీ బాగానే చేసిందనే కామెంట్లు వచ్చాయి. అనసూయ అలా గ్యాప్ ఇవ్వడంతో రష్మీ ఫిల్ చేసేసింది.

Rashmi Gautam Will Continue Jabardasth Instead of Anasuya
Anasuya : అనసూయ స్థానంలో రష్మి గౌతమ్..
వచ్చే వారం కూడా అనసూయ కనిపించేట్టు లేదు. మళ్లీ రష్మీనే అందులోకి తీసుకున్నారు. రష్మీనే యాంకర్‌గా బాగుంది.. అనసూయను పక్కన పెట్టేసేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంక రెండు మూడు వారాలు గనుక అనసూయ కనిపించకపోతే.. రష్మి గౌతమ్ పూర్తిగా ఆ స్థానాన్ని భర్తీ చేసేలా ఉంది. మొత్తానికి అనసూయ సీటుకు రష్మీ ఎసరుపెట్టేలానే ఉంది.
