Anasuya : అబ్బో అన‌సూయ‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అద‌ర‌హో..! వీడియో

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 25 January 2026, 6:00 pm
  •  Anasuya : అబ్బో అన‌సూయ‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అద‌ర‌హో..!

Anasuya  : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలపై చేసే వ్యాఖ్యలు, వారి స్వేచ్ఛను పరిమితం చేసే మాటలు వస్తే గట్టిగా ఎదురు నిలబడే వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, వ్యక్తిగత ఎంపికల విషయంలో ఫెమినిస్ట్ దృక్పథంతో మాట్లాడే అనసూయ, ఇటీవ‌ల‌ అదే ధైర్యాన్ని చూపించింది. నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ, మహిళలు ఎలా ఉండాలి, ఎలా దుస్తులు ధరించాలి అనే విషయంలో ఎవరూ తీర్పు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Anasuya : అబ్బో అన‌సూయ‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అద‌ర‌హో..!

Anasuya : అబ్బో అన‌సూయ‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అద‌ర‌హో..!

Anasuya  : అన‌సూయ టాలెంట్ అద‌ర‌హో..

శివాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టే, తాను కూడా మర్యాదగా, శాంతియుతంగా తన అభిప్రాయాన్ని వెల్లడించానని ఆమె చెప్పింది. అయితే ఈ వ్యవహారం క్రమంగా శివాజీ–అనసూయ మధ్య మాటల యుద్ధంగా మారి, సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది.అనసూయకు మద్దతుగా నిలిచినవారు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టగా, ఆయనకు అనుకూలంగా ఉన్నవారు అనసూయ గతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆమె యాంకర్‌గా చేసిన షోలు, గ్లామర్ ప్రదర్శన, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బికినీ ఫోటోలు అంటూ పాత వీడియోలు, చిత్రాలను షేర్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విమర్శలు కేవలం అనసూయకే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల వరకూ వెళ్లడం మరింత వివాదాస్పదంగా మారింది.

ఇంతకుమించి కొందరు నెటిజన్లు, “శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడితే నువ్వెందుకు స్పందిస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచి హీరోయిన్ అయ్యావు?” అంటూ ఎద్దేవా చేశారు. తాను కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినట్టు అనసూయ చెప్పినా, ట్రోలింగ్ ఆగకుండా “ఏ సినిమాలో హీరోయిన్‌గా నటించావో చెప్పు” అంటూ మరింత రెచ్చగొట్టారు.ఈ విమర్శలకు ఈసారి అనసూయ భిన్నమైన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ‘హీరోయిన్’ అనే పదానికి అర్థం ఏమిటో డిక్షనరీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, హీరోయిన్ అంటే కేవలం కథానాయిక మాత్రమే కాదని, ధైర్యం ఉన్న స్త్రీ అనే అర్థం కూడా ఉందని గుర్తు చేసింది. ఇక ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మ‌యంలో అన‌సూయ‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో అన‌సూయ గిటార్ వాయిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అన‌సూయ‌ని ఇలా చూసి మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి