Home » Entertainment » Rashmi Gautham Love Affair With Sudigali Sudheer
Entertainment

Rashmi Gautam : సుడిగాలి సుధీర్ తో తన ప్రేమ వ్యవహారం బయట పెట్టేసిన రష్మి గౌతమ్….!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 8, 2022, 5:00 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెర ఫేమస్ జంట అయిన సుడిగాలి సుధీర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరు బుల్లితెరకు పరిచయమయ్యారు. యాంకర్ గా రష్మీ కంటెస్టెంట్ గా సుదీర్ చేస్తూ జనాలకు బాగా దగ్గరయ్యారు. ఇక ఈ జబర్దస్త్ షోలోనే వీరి లవ్ ట్రాక్ మొదలైంది. ఇక తర్వాత ఢీ షోలో కూడా వీరు జంటగా నటించి అందరిని మెప్పించారు. అలాగే వీరికి యూట్యూబ్ జోడి అనే బిరుదు కూడా ఇచ్చేసారు. వీరిద్దరిని పెట్టి షోలను కూడా నిర్వహించారంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

Advertisement

ఇక వీరి లవ్ ట్రాక్ వలన ఛానల్ టిఆర్పి కూడా పెరిగేది. ఇక వీరి ప్రేమాయణం చూసిన ప్రతి ఒక్కరూ వీరిది నిజమైన ప్రేమని భావించారు. ఇక ఈ విషయంపై వీళ్ళను చాలా మంది ప్రశ్నించగా.. వీరి మధ్య అలాంటిదేం లేదని ఇది కేవలం స్క్రీన్ పైన ప్రేమాయణం అని చెప్పేశారు. ఇక చాలామంది సుధీర్ రష్మి పెళ్లి చేసుకోవాలని కూడా కోరారు కానీ అసలు నిజం బయటపడడంతో ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇక వీరి మధ్య ఉన్న వ్యవహారాన్ని గెటప్ శీను కూడా ఒకసారి తెలియజేశారు. వారిది కేవలం ఆన్ స్క్రీన్ ప్రేమ మాత్రమే అని పెళ్లి చేసుకునే అంత ఉద్దేశం వారి మధ్య లేదని శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వారిద్దరు కలిసి ఎక్కువ కాలం వర్క్ చేయడం వలన ఈ విషయాన్నీ ఎవరు నమ్మడం లేదు కానీ ఇదే నిజం అని చెప్పాడు గెటప్ శ్రీను.

Rashmi Gautam love affair with Sudigali Sudheer

Advertisement

అయితే ఇటీవల రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ పాస్టర్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రష్మీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగిందిి. ఇక ఆ ఇంటర్వ్యూలో కూడా సుదీర్ రష్మీల మధ్య సంబంధం గురించి ప్రశ్న ఎదురవగా, దానికి రష్మీ చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాకు సుధీర్ కి మధ్య ఉన్న రిలేషన్ పర్సనల్ అని, పర్సనల్ విషయాన్ని ఎలా బయట పెడతాం, బయట పెడితే అది పర్సనల్ ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. దీంతో మళ్లీ రష్మీ సుధీర్ జంట వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక రష్మీ అలా మాట్లాడడంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ చర్చిస్తున్నారు జనాలు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి