Rashmi Gautham: బ్లూ క‌ల‌ర్ దుస్తుల‌లో క్యూట్ క్యూట్ అందాల‌తో పిచ్చెక్కిస్తున్న‌ర‌ష్మీ గౌత‌మ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham: బ్లూ క‌ల‌ర్ దుస్తుల‌లో క్యూట్ క్యూట్ అందాల‌తో పిచ్చెక్కిస్తున్న‌ర‌ష్మీ గౌత‌మ్

 Authored By sandeep | The Telugu News | Updated on :27 March 2022,10:00 am

Rashmi Gautham: బుల్లితెర గ్లామ‌ర‌స్ హీరోయిన్స్‌లో ర‌ష్మీ గౌతమ్ ఒక‌రు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది.

ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’.ఇందులో ర‌ష్మీ గౌత‌మ్ క్యూట్‌గా క‌నిపిస్తుంది. బుల్లితెరపై వారం వారం జబర్దస్తీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే యాంకర్ రష్మీ.. అటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలపై అభిమానులను టచ్ చేస్తుంటుంది. గ్లామర్ లుక్స్‌తో పాటు మానవత్వం చాటుకునేలా రష్మీ పెట్టిన కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. చిరు సినిమాలో రష్మీ స్సెషల్‌ సాంగ్ చేస్తుంద‌ని అంటున్నారు.

Rashmi Gautham : ర‌ష్మీ ర‌చ్చ‌….

Rashmi Gautham mesmarizing looks

Rashmi Gautham mesmarizing looks

ఇదే నిజ‌మైతే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీ గౌత‌మ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది ర‌ష్మీ. ఈ అమ్మ‌డు క్రియేట్ చేసిన సెన్సేష‌న్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మీ పిక్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అంతేకాదు ర‌ష్మీ అందాల‌కు మైమ‌ర‌చిపోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది