Rashmi Gautham : ఏమందం ఇది… చీర‌క‌ట్టులోను మ‌తులు పోగొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌ ర‌ష్మీ గౌత‌మ్..!

Authored By Sam C | The Telugu News | Updated on : 11 January 2022, 11:30 am

Rashmi Gautham : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన యాంక్ ర‌ష్మీ గౌత‌మ్. ఈ అమ్మ‌డికి తెలుగు రాక‌పోయిన కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అల‌రిస్తూ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో సినిమా అవ‌కాశాలు కూడా అందిపుచ్చుకుంటుంది. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది ర‌ష్మీ గౌత‌మ్. ర‌ష్మీ గౌత‌మ్ టాలెంట్ ఆర్టిస్ట్ మాత్ర‌మే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తి కూడా.

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీ గౌత‌మ్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో హోయ‌లు పోతూ అంద‌రి మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది. ర‌ష్మీ గౌత‌మ్ క్యూట్ నెస్‌కి కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఏమందం ఇది అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చీరక‌ట్టులోను మ‌తులు పోగొడుతున్నావుగా అని కామెంట్స్ పెడుతున్నారు.

rashmi gautham stunning looks viral

rashmi gautham stunning looks viral

Rashmi Gautham : క్యూట్‌నెస్‌తో అద‌ర‌గొడుతున్న ర‌ష్మీ

రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా కూడా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp