
rashmika act blind character in Sidharth Malhotra movie
Rashmika Mandanna : రష్మికా మందన్న, Rashmika Mandanna, ‘ పుష్ప ‘ సినిమా, Pushpa’ movie, తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తానేంటో నిరూపించుకుంటుంది. బాలీవుడ్, BollyWood, లో అమితా బచ్చన్, Amita Bachchan, తో కలిసి గుడ్ బై సినిమా,Good bye movie,లో నటించింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమా,Mission Majnu movie,లో హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయింది.
ఈ టీజర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా సర్ప్రైజ్ గా ఉంటుందని సమాచారం. తొలిసారిగా రష్మిక అంధ యువతి పాత్రలో నటించింది. ఇది తన కెరీర్ లో చాలా ముఖ్యమైన పాత్ర. సిద్ధార్థ కి ప్రేయసిగా నటించింది. ఇక రష్మిక అంధురాలి పాత్రలో నటించేందుకు చాలా ప్రిపేర్ అయిందట. సెట్స్ పైకి రాకముందు దీనిపై పరిశోధన కూడా చేసింది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థతో రొమాంటిక్ యాంగిల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాకి యూత్ బాగా ఎట్రాక్ట్ అవుతారని నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల మిషన్ మజ్ను టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సాహస విన్యాసాలతో ఆకట్టుకుంటుంది.
rashmika act blind character in Sidharth Malhotra movie
ఇండియా – పాక్ వార్ నేపథ్యంలో రా ఆపరేషన్ కి సంబంధించిన కథలో సిద్ధార్థ్ సాహసోపేతమైన రా అధికారిగా కనిపించనున్నాడు. ఇందులో షరీబ్ హష్మీ కూడా నటించారు. ఈ సినిమాను శంతను బాగ్చి దర్శకత్వం వహించారు. ఇక రష్మిక కన్నడ లో సినీ కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ఛలో సినిమా ద్వారా ప్రేక్షకులు పరిచయమయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప సినిమా లో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.