Home » Entertainment » Rashmika Mandanna About Her Friend Marriage Old Pics
Entertainment

Rashmika Mandanna : ఎవ్వరికీ చూపించని పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తున్నా.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 16, 2022, 9:00 pm
Advertisement

Rashmika Mandanna : రష్మిక మందన్న నెట్టింట్లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రష్మిక మందన్న తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తన ఇన్ స్టా స్టోరీ ద్వారా రష్మిక తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఇక నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. తాను ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోందనే విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా రష్మిక మందన్న ఓ పోస్ట్ వేసింది.అందులో తన ఫ్రెండ్ పెళ్లి అని చెప్పుకొచ్చింది. అయితే ఫ్లైట్ దొరక్కపోవడంతో ప్రయాణం చేయలేకపోయానని, అయితే తన ఫ్రెండ్ పెళ్లి గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ పోస్ట్ చేస్తున్నానని తెలిపింది.

Advertisement

ఈ మధ్య కాలంలో తనతో దిగిన ఫోటోలు లేకపోవడంతో ఇది నా పర్సనల్ నుంచి ఈ ఫోటోలను షేర్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు రష్మిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నా ఫ్రెండ్ రాగిని పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు నా దగ్గర లేవు.. కానీ ఈ రోజు ఈ ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి.. ఉదయం నాలుగు గంటల ఫ్లైట్ మిస్ అయ్యాను.. ఆ తరువాత నాలుగైదు సార్లు నా ఫ్లైట్ ఆలస్యమైంది.. మొత్తానికి పెళ్లికి చేరుకున్నాను.. ఆమె ఎంత అందంగా ఉందో..

Rashmika Mandanna About Her Friend Marriage Old Pics

Advertisement

ఈ ఫ్రెండ్స్‌తోనే నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాను.. వాళ్లతో నాకు పరిచయం జరిగి 17 ఏళ్లు అవుతోంది.. వాళ్లేం మారలేదు..మేం అంతా ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం.. వాళ్లను ఇలా చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. ఈ సందర్భంగా నా పర్సనల్ స్పేస్ నుంచి కొన్నింటిని మీకు చూపించాలని అనుకుంటున్నాను.. మీ అందరికీ రష్మిక ఎవరో తెలియనప్పుడు ఇలా ఉండేది.. అప్పుడు ఇప్పుడూ ఏమీ మారలేదు కదా? అని రష్మిక చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి