Rashmika Mandanna : రష్మిక మందన్న సమాధానం అదుర్స్.. కర్ణాటక లో ఆమెని ట్రాల్ చేస్తున్న అందరూ సారీ చెప్పే ఆన్సర్ ఇచ్చింది …!

Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతూ వస్తుంది. ఇక దానికి గల కారణం కన్నడ స్టార్ డైరెక్టర్ మరియు హీరో రిషబ్ శెట్టి. ఆయన నటించి మరియు డైరెక్ట్ చేసిన సినిమా కాంతారాను రష్మిక చూడకపోవడమే దీనికి కారణం అని కొందరు అంటున్నారు. అయితే రష్మిక మందన సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కిరాక్ అనే సినిమాతోనే ఈ సినిమాను రిశాబ్ శెట్టి తెరకేకించారు. ఈ సినిమా తర్వాత రష్మిక కు అవకాశాలు వచ్చి గుర్తింపు పొందింది. అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని గొడవలు కారణంగా రష్మిక మరియు రిషిబ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే రిలీజ్ అయిన కాంతర సినిమాను రష్మిక చూడకపోవడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ గా మారింది.

Advertisement

అంతేకాకుండా ఆమె మాట తీరు పద్ధతి జనాలకు నచ్చలేదని… ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు ఆమెను మా సినిమాలలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ షూ స్టోర్ లో రష్మిక మందన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమెకు మరియు రిషబ్ కు మధ్య వివాదం గురించి ప్రశ్నించగా ఆమె మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ నచ్చిన వాళ్ళు నచ్చినట్లు ఏదైనా రాసుకుంటూ పోతారు.. అదంతా నిజమని నేను నమ్మను నన్ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందనె వార్తలు కూడా నేను విన్నానని కానీ ఇప్పటివరకు నాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదని, ఇస్తారని కూడా నేను అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే నేనంటే ఏంటో వాళ్లకు తెలుసు అంటూ రష్మిక వ్యాఖ్యానించింది. అంతేకాకుండా రిసాబ్ శెట్టి తో తనకు ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇస్తూ పనిలేని జనాలు ఏవేవో రాస్తూూ ఉంటారని అవన్నీ నేను పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

Advertisement
Rashmika Mandanna about kotara hero rishab shetty
Rashmika Mandanna about kotara hero rishab shetty

కాంతారా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత మీరు ఆ సినిమా చూశారా అని నన్ను అడిగారు. అప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల చూడలేకపోయాను ఆ తర్వాత నా ఫ్రీ టైం లో ఆ సినిమా చూశాను అని తెలియజేసింది . కాంతారా మూవీ టీం కి కూడా మెసేజ్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, ఎవరో ఏదో ఊహించుకోనేసి ఏదో రాసిస్తే అన్ని నిజాలు అవ్వవు అంటూ వ్యాఖ్యానించారు రష్మిక. ఎం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది. దీంతో రష్మిక మాటలు మరింత వివాదంగా మారాయి. ఎందుకంటే ఈ కన్వర్జేషన్ లో ఆమె రిషబ్ శెట్టి పేరును ఎక్కడ కూడా తీసుకురాలేదట. అంతేకాకుండా మొదట్లో రిషాబ్ శెట్టి పేరు చెప్పగానే ఫింగర్స్ క్రాస్ చేసిందని దీనిబట్టి రష్మిక వివాదం మరింత తీవ్ర స్థాయిలో ముదిరిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Advertisement
Advertisement