Rashmika Mandanna : విజయ్‌తో నా రిలేషన్ ఎవరికి చెప్పుకోలేనిది.. మాల్దీవ్స్‌లో రష్మిక మందన్నా చిల్
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలను ఒక ఊపుఊపేస్తోంది. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్,సక్సెస్‌ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. తనకు ఎటువంటి పరిస్థితులను వచ్చినా ఎదుర్కొంటూ ముందుకెళ్తానని చెప్పుకుంటోంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయిన శ్రీవల్లి.. వరుసగా సినిమాలు చేస్తూ అస్సలు ఖాళీగా ఉండటం లేదు. అటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌ను అనతి కాలంలోనే సొంతం చేసుకుంది. రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ వైడ్ పాపులారిటీని గ్రాబ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ రీసెంట్ గా నటించిన గుబ్ బై సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
దీంతో మరిన్ని అవకాశాలను కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఇక వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక తాజాగా వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. స్ట్రెస్ రిలీఫ్ కోసం మాల్దీవ్ చెక్కేసింది. తాజాగా అక్కడ సుముద్రపు అంచున గల రిసార్ట్స్‌లో చిల్ అవుతున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే, మాల్దీవ్స్ వెళ్లే క్రమంలో ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక కాసేపు ముచ్చటించింది. ఈ సందర్బంగా హీరో విజయ్ ప్రస్తావన తెచ్చింది. ఎందుకంటే రష్మిక మాల్దీవ్స్ వెళ్లే క్రమంలో విజయ్ అనుకోకుండా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. దీంతో వీరు లవ్‌లో ఉన్నారని, ఇదే రుజువు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna About My Relationship With Vijay Deverakonda
Rashmika Mandanna : నా మేలు కోరేవాళ్లలో విజయ్ ఒకరు..
ఎందుకంటే రష్మిక ఎక్కడ ఉంటే అక్కడ విజయ్ ఎలా ప్రత్యక్షం అవుతాడని లాజిక్స్ మాట్లాడుతున్నారు. రష్మిక మాట్లాడుతూ.. ‘విజయ్ నాకు చాలా క్లోజ్.ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు. మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. మేము అన్ని షేర్ చేసుకుంటాం. తామిద్దరం హిట్ మూవీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. విజయ్ ఎప్పటికీ నాకు క్లోజ్ గానే ఉంటాడు. నా మేలు కోరేవాళ్లలో విజయ్ ఒకరు’ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. రష్మిక విజయ్ మధ్య ఏమి ఉందో ఎవరికి తెలియక పోయినా వీరు మాత్రం ఎవరికి భయపడకుండా తమ జీవితాలను సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు.