Rashmika Mandanna : ఏంటి ఇది నేనేనా?.. రష్మిక మందాన్న పోస్ట్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 19, 2021, 6:07 pm

Rashmika Mandanna : రష్మిక మందాన్న గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. అలా అక్కడ హిట్ అవ్వడంతో ఇక్కడి మేకర్స్ దృష్టిలో రష్మిక పడింది. అలా వెంకీ కుడుముల తన సినిమాలో రష్మికను తీసుకున్నాడు. అలా ఛలో సినిమాతో రష్మిక అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే ఇంతలా హిట్ కొట్టేయడం ఓ లెక్క అయితే.. హీరోతో పాటు సరిసమానంగా క్రేజ్ రావడం మరో లెక్క. అలా రష్మికకు వెనువెంటే మరో హిట్ పడింది. గీతగోవిందం సినిమాతో రష్మిక మందాన్న స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమా ఇలా వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేకుండా పోయింది. గతేడాది రెండు బ్లాక్ బస్టర్‌లను తన ఖాతాలో వేసేసుకుంది.

Rashmika Mandanna about one year of Bheeshma

Rashmika Mandanna about one year of Bheeshma

Rashmika Mandanna :ఏంటి ఇది నేనేనా?.. రష్మిక మందాన్న పోస్ట్

గతేడాది ఇదే రోజున భీష్మ రిలీజైంది. ఏడాది అవుతున్న సందర్బంగా రష్మిక స్పందించింది. భీష్మ విడుదలై ఆల్రెడీ ఏడాది అవుతోంది.. ఇది నేనేనా? లేక కాలం ఇంత వేగంగా కదులుతోందా? అంటూ రష్మిక ఆశ్చర్యపోయింది. ఇక భీష్మ షూటింగ్ గ్యాప్‌లో దర్శకుడు వెంకీ, హీరో నితిన్‌తోదిగిన ఫోటోలను రష్మిక షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక పుష్ప, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో మరో చిత్రం, కోలీవుడ్‌లో సుల్తాన్ వంటి ప్రాజెక్ట్‌లతో రచ్చ చేస్తోంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp