Rashmika Mandanna : మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న రష్మిక మందన్నా.. అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న రష్మిక మందన్నా.. అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..!

Rashmika Mandanna : క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తుంది. చిన్న వయసులోనే ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఛలో’ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని రష్మిక అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఇక అక్క‌డ నుండి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 March 2022,10:00 am

Rashmika Mandanna : క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తుంది. చిన్న వయసులోనే ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఛలో’ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని రష్మిక అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఇక అక్క‌డ నుండి ర‌ష్మిక‌కి అడ్డంకులు లేకుండా పోయాయి. తన కెరీర్‌ మొత్తంలో రష్మిక మందన్నా చేసిన సినిమాలు తక్కువే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది.2020 సంవత్సరానికి గానూ ఆమె ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా ఎంపికైంది ర‌ష్మిక‌.

గతంలో ఆమె హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకోవడం.. టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం వంటి వార్తల వల్లే ఈ పేరు దక్కింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా, ట్విట్టర్ లో మొత్తంగా 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్, తన మూవీ అప్డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది.క్లీవేజ్‌ అందాలతో విరహాలు పోతూ కుర్రాళ్లకి చెమటలు పట్టించడంలో రష్మిక ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు ట్విట్టర్, ఇన్ స్టాలో తన హవా చూపిన రష్మిక మండన్న తాజాగా తన య్యూటూబ్ ఛానెల్ ను ప్రారంభించింది.

Rashmika Mandanna beautiful looks in saree

Rashmika Mandanna beautiful looks in saree

Rashmika Mandanna : చీర‌లో చించేసిందిగా..

అయితే దీని ద్వారా కూడా త‌న అభిమానుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నుంది. ఇక ఈ అమ్మ‌డు తాజాగా చీర‌క‌ట్టులో స‌రికొత్త లుక్ లో మెరుస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.ర‌ష్మిక క్యూట్ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.గ‌తేడాది పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీతో రష్మిక పాపులారిటీ డబుల్ అయ్యింది. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది