Rashmika Mandanna : లెహంగాలో హోయ‌లు పోయిన ర‌ష్మిక‌.. అమ్మ‌డి అందాల‌కు థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: September 7, 2022, 8:30 pm

Rashmika: ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్న‌. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అంది పుచ్చుకున్న ర‌ష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను నటించిన తొలి హిందీ ఫిల్మ్ ‘గుడ్ బై’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజా ఈవెంట్ లో రష్మిక మందన్న ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో స్టార్ హీరోయిన్ అందరి చూపును తనవైపే తిప్పుకుంది. ప్రింటెడ్ లెహంగా, వోణీ ధరించిన రష్మిక నాజుకూ అందాలను విందు చేసింది. తన ప్రజెన్స్ తో ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా కొనసాగింది.

ర‌ష్మిక‌ని చూసిన ఆమె అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బడ్డారు. వారికి సెల్ఫీలు ఇస్తూ స‌ర‌దాగా ముచ్చ‌టించింది. అయితే ర‌ష్మిక లుక్ మాత్రం అంద‌రి దృష్టిని తెగ ఆక‌ర్షించింది. హిందీలో తను నటించిన తొలిచిత్రం ‘గుడ్ బై’ కావడంతో నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు రష్మిక ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో పాటు ప్రమోషన్స్ లోనూ పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, శాండల్ వుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ గా పలు అవకాశాలతో పలు భారీ సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు రష్మిక మందన్న.

Rashmika Mandanna beautiful looks viral on youtube

Rashmika Mandanna beautiful looks viral on youtube

Rashmika Mandanna : అద‌రగొట్టే అందం..

ఇటీవల సీతారామం మూవీలో ఒక కీలక రోల్ చేసి మంచి పేరు అందుకున్న రష్మిక, తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ గుడ్ బై. నిజానికి బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే మూవీకి మొదట సైన్ చేశారు రష్మిక, అయితే షూట్ ఆలస్యం వలన మిషన్ మజ్ను రిలీజ్ కి మరింత సమయం పట్టనుండడంతో ఆ తరువాత ఒప్పుకున్న గుడ్ బై మొదట రిలీజ్ అవుతోంది. లెజెండరీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కూతురుగా గుడ్ బై మూవీలో రష్మిక కనిపించనుండగా వికాస్ బాల్ దీనిని తెరకెక్కించారు. కామెడీ తో కూడిన ఎమోషనల్ డ్రామా మూవీగా తెరకెక్కిన గుడ్ బై అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp