Bigg Boss 6 Telugu : అది బిగ్ బాస్ హౌసా? లేక బ్రోతల్ హౌసా? అంటూ బిగ్ బాస్ 6 పై సీరియస్ అయింది ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : అది బిగ్ బాస్ హౌసా? లేక బ్రోతల్ హౌసా? అంటూ బిగ్ బాస్ 6 పై సీరియస్ అయింది ఎవరో తెలుసా?

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 రెండు రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు.. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీ సీజన్ వచ్చింది. ఓటీటీతో 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో అందరూ చూశారు. ఆ తర్వాత ఇప్పుడు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 September 2022,8:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 రెండు రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు.. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీ సీజన్ వచ్చింది. ఓటీటీతో 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో అందరూ చూశారు. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేసింది. ఇది కూడా 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది కానీ.. స్టార్ మా చానెల్ లో రోజూ ఓ గంట ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ రియాల్టీ షోకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. కొందరు బిగ్ బాస్ షోకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ షోపై మండిపడుతున్నారు.

ఈ షోతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కొందరు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. కొందరు కంటెస్టెంట్ల జీవితాన్ని కూడా బిగ్ బాస్ మార్చేస్తోంది. కొందరికి పాజిటివ్ గా అయితే మరికొందరికి నెగెటివ్ గా. ఏది ఏమైనా.. 100 రోజులు ఒకే ఇంట్లో.. కొత్త వ్యక్తుల మధ్య ఉండటం.. అది కూడా చుట్టూ కెమెరాలు ఉంటే.. మనకు మనం ఎలా ఉంటాం అనేది నిజంగానే ఆసక్తికరమైన కాన్సెప్టే కానీ.. ఇటువంటి షోల వల్ల జనాలకు వచ్చే ఉపయోగం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇటీవల స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. అందులో పెళ్లయిన వాళ్లు చాలా తక్కువ మిగితా వాళ్లంతా యువతులే. 20 ఏళ్ల లోపు వారే.

why negativity spread on Bigg Boss 6 Telugu

why negativity spread on Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : చెడ్డీలు, మిడ్డీలు వేసుకొని తిరిగి ఏం మెసేజ్ ఇస్తున్నారు?

వాళ్లు హౌస్ లోపల చెడ్డీలు, మిడ్డీలు వేసుకొని తిరుగుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ బిగ్ బాస్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. మరోవైపు సీపీఐ నారాయణ కూడా బిగ్ బాస్ షోపై స్పందించారు. ఇది ఒక పనికిమాలిన షో.. అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ కోతులు. ఆ షోను చూసే వాళ్లు కూడా కోతులే.. అంటూ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి.. నారాయణ ఇప్పుడే కాదు.. గతంలో వచ్చిన అన్ని బిగ్ బాస్ సీజన్లపైనా ఇలాగే స్పందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. అసలు అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బిగ్ బాస్ యాజమాన్యం కానీ.. హోస్ట్ నాగార్జున కానీ స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది