Rashmika Mandanna : ఇంత అంద‌మా.. ఇది వ‌ర్ణించ‌డం ఎవ‌రి త‌రం కూడా కాదేమో..!

Authored By Sam C | The Telugu News | Updated on : 9 October 2022, 1:30 pm

Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల హృద‌యాలు కొల్ల‌గొట్టింది. ర‌ష్మిక వ‌రుస పెట్టి చిత్రాలు చేస్తుండ‌గా, అందులో కొన్ని మంచి విజ‌యాలు కూడా సాధిస్తున్నాయి. చివ‌రిగా ఆమె `గుడ్‌బై` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఈ శుక్రవారం విడుదల కాగా, సినిమా ప్రమోషన్‌లో భాగంగా హంగామా చేస్తుంది. సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రికి పిచ్చెక్కించింది. ఈ బ్యూటీ రీసెంట్‌గా మాల్దీవుల‌కి వెళ్ల‌గా, అక్క‌డ బ్యూటీ క్యూట్ గా చేసే ర‌చ్చ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ర‌ష్మిక అందాల ర‌చ్చ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ట్రెండీ వేర్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన రష్మిక.. గతేడాది `పుష్ప`లో శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే స్టెప్పులు ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యాయి. ఎంతో మందిని ఆమెని అనుకరించారు. శ్రీవల్లి పేరు సైతం బ్రాండ్‌గా మారింది. బన్నీతోపాటు రష్మిక పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. రష్మిక మొదటి బాలీవుడ్ సినిమా గుడ్‌బై కాగా, ఈ చిత్రంలో రష్మికతో పాటు అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ ఉన్నారు. ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేయనున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna beautiness

Rashmika Mandanna beautiness

Rashmika Mandanna : ఏమందం ఇది…

ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక ఈ అమ్మ‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి మాల్దీవుల‌కి వెళ్లింద‌ని అంటున్నారు. గతంలో వీరిద్దరూ తాము మంచి స్నేహితులమని పలు సందర్భాల్లో వెల్లడించారు కానీ ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్తున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉందని, అది ప్రేమే అయి ఉంటుందని మళ్లీ ప్రచారం మొదలైంది. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి రెండు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడిన విష‌యం విదిత‌మే.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి