Rashmika Mandanna : తెర వెనుక వేసిన వేషాలివే.. రష్మికా మందన్న వీడియో వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 April 2022, 10:00 pm

Rashmika Mandanna : రష్మిక మందన ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం ఛలో అనే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో పాపులర్ అయింది. ఆ సినిమాలోని హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. నిశ్చితార్థం వరకు వ్యవహారం వెళ్లింది. కానీ తెలుగులో ఛలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కథ మారిపోయింది.ఛలో ఎఫెక్ట్‌తో ఇక్కడ రష్మికకు మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

చూస్తుండగానే ఇలా స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో పెళ్లిని పక్కన పెట్టేసింది. రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ చెప్పేసుకుంది. అలా మొత్తానికి ప్రేమ, పెళ్లి అనే వాటిని పక్కన పెట్టేసింది రష్మిక. కానీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల ప్రభావంతో రష్మిక, విజయ్ మధ్య ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి.అయితే రష్మిక మాత్రం ఈ రూమర్లను విని నవ్వుకుంటుందట. కానీ రష్మిక మాత్రం విజయ్ ఫ్యామిలీతో ఎక్కువగా సమయం గడుపుతుంది. మొత్తానికి రష్మిక మాత్రం ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది.

rashmika Mandanna BTS Video Goesv viral

rashmika Mandanna BTS Video Goesv viral

అందుకే బాలీవుడ్‌లో వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తోంది. అమితాబ్ బచ్చన్, వరుణ్ దావన్ వంటి వారితో నటించేస్తోంది.తాజాగా రష్మిక మందన ఓ వీడియోను షేర్ చేసింది. బిహెండ్ ది సీన్స్ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను షూటింగ్ స్పాట్‌లో చేసే అల్లరి గురించి రష్మిక తెలిపింది. మొత్తానికి తెర వెనుక రష్మిక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by boAt (@boat.nirvana)

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp