Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తో ‘ ఆ ‘ మ్యాటర్ లో ఒప్పేసుకున్న రష్మిక మందన్న..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 27, 2023, 6:00 pm

Rashmika Mandanna : ‘ గీతాగోవిందం ‘ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరిపై భారీ ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. రష్మిక మందన ఆమధ్య విజయ్ దేవరకొండ తో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్ కు వెళ్ళింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇద్దరు కలిసి వెళ్లకున్న ఇద్దరూ ఒకే చోటుకి వెళ్లారని క్లియర్ గా అర్థమయింది. వీళ్ళిద్దరిపై వస్తున్న వార్తలకు రష్మిక స్పందించింది. అవును మేమిద్దరం కలిసి ట్రిప్ కు వెళ్ళామని క్లారిటీ ఇచ్చింది. అయితే అతడితో ట్రిప్పుకు వెళితే తప్పేంటి అని రష్మిక ప్రశ్నించింది.

దీంతో రష్మిక ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే రష్మిక ఆన్లైన్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకు రష్మికను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ కు తనకు ఉన్న రిలేషన్ గురించి వస్తున్న వార్తలను రష్మిక కొట్టిపారేసింది. మేమిద్దరం మంచి స్నేహితులం స్నేహితులుగానే ఇద్దరం ట్రిప్ కు వెళ్ళాం అని రష్మిక తెలిపింది. కానీ జనాలు మాత్రం వీరిద్దరి మధ్య వేరే రిలేషన్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసిన నటించిన తర్వాత కూడా వీరిద్దరు ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తున్నారు.

Rashmika Mandanna comments about Vijay devarakonda

Rashmika Mandanna comments about Vijay devarakonda

పలుమార్లు విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి రష్మిక కనిపించింది. వీళ్ళిద్దరూ కలిసి ట్రిపుకు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని చాలామంది అనుకుంటున్నారు. అవి కేవలం రూమర్స్ మాత్రమే నిజాలు కావని రష్మిక చెప్పుకొచ్చింది. ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం సమంత తో కలిసి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp