Rashmika Mandanna : ఫోన్ లో స్టార్ డైరెక్టర్ అలా చేసేసరికి బ్లాక్ లో పెట్టా రష్మికా మందన్న సంచలన కామెంట్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : ఫోన్ లో స్టార్ డైరెక్టర్ అలా చేసేసరికి బ్లాక్ లో పెట్టా రష్మికా మందన్న సంచలన కామెంట్స్..!!

Rashmika Mandanna : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన. 2021 “పుష్ప” సినిమా.. రష్మిక తలరాతను పూర్తిగా మార్చేసింది. మొదట కనడ ఇండస్ట్రీలో రాణించిన రష్మిక “చలో” సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఇదిలా ఉంటే హీరోయిన్ గా తన కెరియర్ స్టార్ట్ అవ్వకముందు ఓ డైరెక్టర్ తో కలిగిన ఇబ్బంది రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కెరియర్ ప్రారంభంలో.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :6 April 2023,9:00 am

Rashmika Mandanna : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన. 2021 “పుష్ప” సినిమా.. రష్మిక తలరాతను పూర్తిగా మార్చేసింది. మొదట కనడ ఇండస్ట్రీలో రాణించిన రష్మిక “చలో” సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఇదిలా ఉంటే హీరోయిన్ గా తన కెరియర్ స్టార్ట్ అవ్వకముందు ఓ డైరెక్టర్ తో కలిగిన ఇబ్బంది రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కెరియర్ ప్రారంభంలో.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టకు ముందు ఓ స్టార్ దర్శకుడు ఫోన్ చేశారట.

Rashmika Mandanna comments on Star director

Rashmika Mandanna comments on Star director

అయితే అది ప్రాంక్ కాల్ అని రష్మిక… అనుకొని కట్ చేయడం జరిగిందంట. పదేపదే చేస్తూ ఉండటంతో సినిమాలో చేసే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ నంబర్ ని బ్లాక్ లో పెట్టడం జరిగిందట. అయినా కానీ ఆ స్టార్ దర్శకుడు రష్మిక మందననీ వదల లేదట. తర్వాత రష్మిక మందన స్నేహితులతో అనేక ప్రయత్నాలు చేసినా గాని స్పందించకపోవడంతో ఈసారి ఏకంగా క్లాస్ టీచర్ ద్వారా సదరు దర్శకుడు నేరుగా రంగంలోకి దిగటం జరిగిందట. దీంతో ఒక్కసారిగా రష్మిక షాక్ అయినట్లు..సినిమా ఒకే చేయడం జరిగిందట. ఇప్పుడు ఆ దర్శకుడు కారణంగానే … ఈ రీతిగా కెరియర్ లో దూసుకుపోతున్నట్లు రష్మిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna audience hates these heroines

Rashmika Mandanna audience hates these heroines

ఇదిలావుండగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమాకి దాదాపు 5 కోట్ల పారితోషకం చార్జి చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలుతోంది. నేడు రష్మిక మందన పుట్టినరోజు కావడంతో “పుష్ప” సినిమా టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. “పుష్ప” సినిమాతో పాటు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టు కూడా రష్మిక లైన్ లో పెట్టడం జరిగింది. ఈ రీతిగా వరుస ప్రాజెక్టులతో రష్మిక దూసుకుపోతోంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది