Rashmika Mandanna : స్టేజీపైన ‘సామీ సామీ’ అంటూ చిందేసి.. ‘తగ్గేదేలే’ అన్న రష్మిక మందన..
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచ్చరచ్చ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లాక్ కలర్ శారీలో వచ్చింది గ్లామరస్ రష్మిక మందన.
తన స్పీచ్‌కు ముందర బన్నీ చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పిన అభిమానుల్లో హుషారు నింపింది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ను సపోర్ట్ చేసినందకు థాంక్స్ చెప్పింది. అభిమానులందరికీ ఐ లవ్ యూ చెప్పిన రష్మిక.. తనకు ఈ సినిమాలో అవకాశం వచ్చినందకు ఆనందంగా ఉందని, ఈ సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుందని, ప్రతీ ఒక్కరు థియేటర్స్‌లో ఈ నెల 17న సినిమా చూడాలని కోరింది.యాంకర్ సుమ సినిమాలోనే ఏదేని డైలాగ్ చెప్పాలని కోరగా, ‘ఏ చీ చీ.. నేను చూడటం లేదని ఓ పులుపెక్కి పోతున్నావటగా’ అనే డైలాగ్ చెప్పి ప్రేక్షకులను, అభిమానులను అలరించింది రష్మిక మందన.

rashmika mandanna dance performance in pushpa pre release event
Rashmika Mandanna : అందరికీ ఐ లవ్ యూ చెప్పిన క్యూట్ రష్మిక మందన..
ఈ క్రమంలోనే ఓ డ్యాన్స్ స్టెప్ వేయాలని రిక్వెస్ట్ చేయగా, రష్మిక మందన ‘సామీ సామీ’ పాటకు స్టేజీపైన రెండు స్టెప్పులేసి హుషారెక్కించింది. ఈ సినిమాలో చిత్తూరు జిల్లాకు చెందిన గిరిజన యువతి ‘శ్రీవల్లి’గా రష్మిక మందన కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటల్లో రష్మిక మందన చాలా అందంగా కనబడుతోంది. రష్మిక మందన ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నదని, పల్లెటూరు అమ్మాయిగా సినిమాలో చాలా అందంగా కనబడుతుందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు.
