Vijay Deverakonda : ఇక పై రెగ్యులర్‌గా వస్తా .. ఊరికి చేసేది చాలా ఉంది : స్వగ్రామంలో విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 March 2026,6:37 pm

ప్రధానాంశాలు:

  •  Vijay Deverakonda : ఇక పై రెగ్యులర్‌గా వస్తా .. ఊరికి చేసేది చాలా ఉంది : స్వగ్రామంలో విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ..!

Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. “స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడం, అదే సమయంలో పెళ్లి జరగడం నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. ఈ ఆనందాన్ని గ్రామస్తులందరితో పంచుకోవడం గర్వంగా ఉంది” అని అన్నారు.

Vijay Deverakonda : ఇక పై రెగ్యులర్‌గా వస్తా .. ఊరికి చేసేది చాలా ఉంది : స్వగ్రామంలో విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ..!

Vijay Deverakonda : ఇక పై రెగ్యులర్‌గా వస్తా .. ఊరికి చేసేది చాలా ఉంది : స్వగ్రామంలో విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ..!

ఇకపై తరచూ గ్రామానికి వస్తానని కుటుంబంతో కలిసి ఊరితో మరింత దగ్గరగా ఉంటానని స్పష్టం చేశారు. తమ్ముడు ఆనంద్ వివాహాన్ని కూడా గ్రామంలోని అందరి సమక్షంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. “మన ఊరికి చేయాల్సింది చాలా ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించవచ్చు” అంటూ గ్రామాభివృద్ధిపై తన కట్టుబాటును తెలియజేశారు.దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన గ్రామస్తుల్లో ఆనందాన్ని నింపింది.

ఇదిలా ఉండగా, వివాహబంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు నాగర్‌కర్నూల్ జిల్లాలో సందడి చేశారు. విజయ్ స్వగ్రామమైన బల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామంలో కొత్తగా నిర్మించిన ఫామ్‌హౌస్‌లో నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. 32 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయ్ కుటుంబాన్ని గ్రామస్తులు, అభిమానులు కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పులతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. స్వగ్రామంతో తన బంధాన్ని మరింత బలపరుచుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని విజయ్ దేవరకొండ మరోసారి హామీ ఇచ్చారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి