Rashmika Mandanna : నన్ను పుట్టించినందుకు మీకు థ్యాంక్స్.. తల్లిదండ్రులపై రష్మిక మందన్న ఎమోషనల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 22, 2022, 2:00 pm

Rashmika Mandanna : ఛలో బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తోంది. ఒకేసారి రెండు మూడు చిత్రాలను రెడీ చేస్తోంది. అలా రష్మిక మందన ఇప్పుడు క్రేజీ బ్యూటీగా దూసుకుపోతోంది. అయితే రష్మిక మందన ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం ఇస్తుంది. రష్మిక తన కుటుంబానికి దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. వాళ్లు కర్ణాటకలో ఉంటే.. రష్మిక హైద్రాబాద్‌లో సపరేట్‌గా ఉంటుంది. ఇక షూటింగ్ నిమిత్తం ముంబైలోనూ ఉంటుంది.

అప్పుడప్పుడు మాత్రమే రష్మిక తన ఇంటికి వెళ్తుంటుంది. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే వెంటనే రష్మిక తన ఇంట్లో వాలుతుంది. తన చిట్టి చెల్లితో ఆడుకుంటుంది. పేరెంట్స్‌‌తో కలిసి టైం గడుపుతుంటుంది. ఇక ఈ నలుగురు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. రష్మిక తన ఫ్యామిలీ ఫోటోలు రిలీజ్ చేసిన ప్రతీ సారి ట్రెండ్ అవుతుంటాయి. అందులో ఆమె చిట్టి చెల్లి ఫోటోలు మాత్రం అందరినీ కట్టి పడేస్తుంటాయి. తాజాగా రష్మిక తన పేరెంట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. తల్లిదండ్రుల పెళ్లి రోజని తెలిసి కూడా కాస్త ఆలస్యంగా విషెస్ చెప్పిందట. అంటే రష్మిక అంత బిజీగా ఉందన్న మాట. అయితే ఇదే విషయాన్ని చెబుతూ సారీ అనేసింది.

Rashmika Mandanna Emotional Post Her parents

Rashmika Mandanna Emotional Post Her parents

నాకు తెలుసు నేను ఇది చాలా లేటుగా చెబుతున్నానని, హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్సీ. నన్ను పుట్టించినందుకు, ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు, నాకు నేనుగా.. నాకు నచ్చినట్టుగా బతకనిస్తున్నందుకు థ్యాంక్స్.. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం మీరే.. నేను మీకెప్పుడూ రుణపడే ఉంటాను అని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళంలో వారసుడు (దళపతి విజయ్ 66వ చిత్రం) అనే సినిమాతో పలకరించబోతోంది. ఇక బన్నీ పుష్ప 2 చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ఇక అంతలోపు తన బాలీవుడ్ ప్రాజెక్టులను రష్మిక పూర్తి చేయనుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp