Rashmika Mandanna : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తాజాగా ‘సప్త సాగరాలు దాటి ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. మనకు తెలిసిందే రష్మిక మందన కన్నడ నటి. అక్కడ ఆమె మొదటి సినిమా ‘ కిరాక్ పార్టీ ‘ 2016 లో విడుదలైన ఈ సినిమా లో రక్షిత్ శెట్టి , రష్మిక మందన కలిసి నటించారు. కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సెట్స్ సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారట.
తమ బంధం శాశ్వతం చేసుకోవాలని పెళ్లికి కూడా రెడీ అయ్యారట. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. మరి కొద్ది రోజుల్లో వివాహం ఉందనగా రష్మిక మనసు మార్చుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుందట. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పిందట. కన్నడ పరిశ్రమలో ఆమెపై వ్యతిరేకత రావడంతో టాలీవుడ్ కి వచ్చేసింది. కాలం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక రక్షిత్ శెట్టి కన్నడ లో వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది చార్లీ 777 సినిమా చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సప్త సాగరాలు దాటి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
అయితే రక్షిత్ శెట్టి రష్మిక కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించినట్టు వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఓ అమ్మాయిని రక్షిత్ శెట్టి ఇష్టపడ్డారట. అమ్మాయికి లవ్ లెటర్ కూడా రాశారట. అయితే అవి స్వయంగా తాను ఇవ్వకుండా బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చి అమ్మాయికి ఇవ్వమన్నారట. రెండేళ్లకు కూడా ఆ అమ్మాయి నుంచి ఎటువంటి స్పందన రాలేదట. ఎందుకంటే రక్షిత్ శెట్టి రాసిన లవ్ లెటర్స్ అమ్మాయికి చేరలేదట. ఫ్రెండ్ మోసం చేసి ఇవ్వలేదట. అంతేకాకుండా అతను అమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్లి కూడా చేసుకున్నాడట. క్లోజ్ ఫ్రెండ్ చీటింగ్ వలన నచ్చిన అమ్మాయిని మిస్ చేసుకున్నానని రక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇలా చూస్తుంటే రక్షిత్ శెట్టికి ప్రేమ కలిసి రావడం లేదనిపిస్తుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.