#image_title
Niharika Konidela : సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.దీంతో సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. మనకు తెలిసిందే ఆమె యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై కూడా కనిపించారు. కానీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత 2020లో నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొద్ది కాలం బాగానే ఉన్నా తర్వాత ఏమైందో తెలియదు కానీ మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
ఇక అప్పటినుంచి నిహారిక గురించి ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా నిహారిక విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, పోస్టులతో వైరల్ అవుతూ ఉన్నారు. ఆమె విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏం చేసినా అది వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు.
అయితే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వారిని, తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారికి సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. వాళ్లతో గడిపిన క్షణాలు జీవితంలో మర్చిపోను అని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క వీడియోలో అందరూ వచ్చేలా పోస్ట్ చేశారు. వీడియో తో పాటు లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్ అని క్యాప్షన్ పెట్టారు. అందులో లావణ్య, శ్రీజ, వితికా, మోనాల్, జ్యోతిరాయ్, నిహారిక తల్లి పలువురు ఉన్నారు. ఈ వీడియో చూసిన నటిజెన్లు లవ్ సింబల్ షేర్ చేస్తున్నారు. మరి కొందరు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.