Rashmika Mandanna : “రష్మిక మందన్న నన్ను క్షమించు.. తప్పు చేశాను .. బుద్ధి వచ్చింది ” ఈ మాటలు అన్నది ఎవరో కాదు !

 Authored By prabhas | The Telugu News | Updated on :25 November 2022,11:00 am

Rashmika Mandanna : ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమా అంటే కాంతారా అని చెప్పాలి. ఇది ఒక కన్నడ సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ నేషనల్ క్రష్ అయిన రష్మికపై పడిందని చెప్పాలి. ఇక వివరాల్లోకెళ్తే రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మూడు సినిమాలు ఓకే చేసి అక్కడ కూడా చక్రం తిప్పుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో విలేకరులు కంటపడింది రష్మిక. ఈ సందర్భంగా విలేకరులు కాంతరా సినిమా చూశారా అంటూ రష్మికానీ అడగగా, ఇంకా చూడలేదు త్వరలోనే చూస్తా అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరల్ అయింది. ఇక ఈ వీడియోని చూసిన కన్నడ ప్రేక్షకులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో కెరియర్ మొదలుపెట్టి కన్నడ ఇండస్ట్రీకి చెందిన దానివి అయిన నువ్వు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సాధించిన కన్నడ సినిమా కాంతారా ఇంకా చూడకపోవడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి మూలాలను మర్చిపోయావా అంటూ రకరకాలుగా కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే ఓ టీవీ ఛానల్ రష్మికపై మండిపడుతూ ఆమె కావాలనే ఈ సినిమా చూడలేదంటూ ప్రచారం చేసుకొచ్చిందింది. అంతేకాదు రష్మిక ఇంతకుముందు నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న రక్షిత్ శెట్టి తమ్ముడే కాంతారా లో నటించిన రిషబ్ శెట్టి..

Rashmika Mandanna forgive me I made a mistake

Rashmika Mandanna forgive me I made a mistake

ఈ కారణంగానే ఆమె ఈ సినిమా చూడలేదంటూ వార్తలను ప్రచూరించారు. దీంతో రష్మిక ఎన్నడూ లేని రష్మిక మొదటిసారి లాంగ్ నోట్ విడుదల చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాపై ఎందుకింత కుట్ర పంన్నుతున్నారంటూ ఎమోషనల్ అయింది. దీంతో అసలు నిజం తెలుసుకున్న ఆ ప్రముఖ టీవీ ఛానల్ రష్మికకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పి తమ తప్పును ఒప్పుకున్నారు. టీవీ ఛానల్ అయితే క్షమాపణ చెప్పింది కానీ కన్నడ పేక్షకులు మాత్రం ఆమెపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. రీసెంట్గా వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ అంటూ వెళ్లడం గమనార్హం.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి