Intinti Gruhalakshmi 25 Nov Today Episode : అనసూయను కూడా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన నందు.. తులసిపై నందు సీరియస్.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 25 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 25 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 799 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను ఇక్క ప్రశాంతంగా బతకనివ్వు.. ప్రశాంతంగా చావనివ్వు. ఇది నా ఆఖరి కోరిక అనుకో అని పరందామయ్య.. అనసూయతో అనడంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనసూయ. మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి. అత్తయ్య ఎక్కడికి వెళ్లారో నేను చూస్తా అని బయటికి వెళ్తుంది తులసి. వద్దు.. నేను ఇక బతకను అని తన ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటుంది అనసూయ. దీంతో తనను వెతుక్కుంటూ వెళ్లిన తులసి.. అనసూయ చనిపోవాలనుకోవడం చూసి షాక్ అవుతుంది.
వెంటనే తనను బావిలో దూకకుండా ఆపుతుంది. ఏంటి అత్తయ్య మీరు ఇలా చేశారు. ప్రాణ సమానంగా ప్రేమించిన వాడికి చేసిన గాయాన్ని మానేలా చేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి గాయాన్ని ఎవ్వరూ మానేలా చేయలేరు. మామయ్యకు మీరే ఆ గాయం చేశారు. మేమంతా నిన్నా మొన్నా మీ మధ్యకు వచ్చిన వాళ్లం. అసలు బంధం మీది.. మీ ఇద్దరిదీ. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని 50 ఏళ్లు నిలబడ్డ ఆ బంధం.. చేసిన ఆ వాగ్దానం అంత తేలికగా తెగిపోదు అత్తయ్య. ఎవరో నా లాంటి దురదృష్టవంతురాలికి అలా జరుగుతుంది. బాధ అనేది జీవిత ప్రయాణంలో ఒక అనుభూతి కానీ.. గమ్యం కాదు. కొద్దిగా ఓపిక పడితే కాలానికి కొద్దిగా సమయం ఇస్తే మీరిద్దరూ మళ్లీ దగ్గరవుతారు.. అంటుంది అనసూయ.
మామయ్య పట్ల మీ ప్రవర్తనకు మొదటి సారి కోపం తెచ్చుకున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోలేదంటే అర్థం ఉంది. కానీ.. మామయ్యను కూడా అర్థం చేసుకోలేకపోవడం ఏంటి అత్తయ్య. మీరు చేసిన తప్పు అది అంటుంది తులసి. దీంతో అయ్యో అయ్యో అంటూ ఏడుస్తుంది అనసూయ.
నువ్వు చెప్పినట్టు పెద్ద తప్పు జరిగిపోయింది. నా భర్తను కష్టపెట్టాను.. బాధపెట్టాను. దేవుడిని ఆయన గుడిలో నుంచి తరిమేశాను అని అంటుంది అనసూయ. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. జీవితంలో నుంచి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయాను.. అంటుంది అనసూయ.
నేనే నా మనసును ఒప్పించుకోలేకపోయాను. సామ్రాట్ నా కళ్ల ముందు ఎప్పుడు కనబడినా పట్టరానంత కోపం వచ్చేది. మీ ఇద్దరి మధ్య ఏం లేదని, కేవలం స్నేహమే అని తెలుసు. అయినా కూడా నా మనసుకు నచ్చజెప్పుకోలేకపోయేదాన్ని. ఎందుకో కూడా నాకు తెలియదు.
Intinti Gruhalakshmi 25 Nov Today Episode : తులసి మాటలకు కూల్ అయిన అనసూయ
గత 26 ఏళ్లుగా నువ్వు నాకు అలవాటు అయ్యావు. ఆ అలవాటుకు హక్కును వదులకోలేకనే ఇదంతా. నా చేతులతోనే నా సంతోషాన్ని కాల్చేసుకున్నాను అంటుంది అనసూయ. దీంతో ఏడవద్దు అత్తయ్య అంటుంది తులసి. చాలు అత్తయ్య.. బాధపడింది చాలు అత్తయ్య అంటుంది.
ఏడవద్దు ప్లీజ్ అంటుంది. ఆయన లేకుండా నేను ఉండలేను చచ్చిపోతాను. ఇన్నాళ్లుగా నేను ఎప్పుడైనా ఆయన కళ్లలో కోపం చూశాను కానీ.. ధ్వేషం చూడలేదు. మొదటిసారిగా చూస్తున్నాను. ఆ ద్వేషాన్ని చూస్తూ నేను బతకలేను. చచ్చిపోతాను అంటుంది అనసూయ.
ఆయన్ను చివరిసారిగా క్షమాపణ అడుగుతాను. ఒక్కసారి ఆయన్ను ఇంటికి తీసుకొస్తావా అంటుంది అనసూయ. ఇన్నేళ్లుగా నిన్ను అది తీసుకురా.. ఇది తీసుకురా అంటూ టార్చర్ పెట్టాను. నాకు నా భర్త కావాలి.. ఆయనే నాకు ప్రపంచం. ఆయనే నాకు లోకం. ఆయన లేని జీవితం నాకు వద్దు. నా దేవుడిని నా దగ్గరికి చేర్చు అమ్మ అంటుంది అనసూయ.
అమ్మ.. నన్ను క్షమిస్తావు కదూ.. నా బతుకు మాత్రం ఆయనే. ఆయన లేకపోతే నా ప్రాణం పోతుంది. తెచ్చివ్వు అంటుంది అనసూయ. అసలు ఏం జరిగింది.. నోరు విప్పండి అని నందు.. అందరినీ అడుగుతాడు. కానీ.. ఎవ్వరూ ఏ సమాధానం చెప్పరు.
దీంతో లాస్య.. అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది. నేను ఆ ఇంటికి రాను.. ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు అని పరందామయ్య అన్న విషయాలను చెబుతుంది లాస్య. దీంతో నందుకు కోపం వస్తుంది. అసలు ఆయన్ను ఎలా వెళ్లనిచ్చావు.. నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు నందు.
అదికాదు డాడ్ అంటే నోర్మూయ్ అంటాడు నందు. అబద్ధం చెప్పి నన్ను మాయ చేద్దామనుకున్నావు. ఇదేనా నువ్వు చూసుకున్న బాధ్యత. ఇదేనా మాట నిలుపుకునే పద్ధతి. యూజ్ లెస్ ఫెలో. మిమ్మల్ని ఎవ్వరినీ నమ్మను అంటాడు నందు. ఇంతలో సామ్రాట్.. తులసికి ఫోన్ చేస్తాడు.
తులసి, అనసూయ ఇద్దరూ నడిచి వెళ్లడం చూసి ఆ కాలనీ వాళ్లు పలు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అనసూయకు కోపం వస్తుంది కానీ.. ఏం అనొద్దు అని అంటుంది తులసి. మరోవైపు అనసూయను తన ఇంటికి తీసుకొస్తుంది. మా నాన్న ఎక్కడికి వెళ్లాడు.. ఎక్కడున్నాడు అని అడుగుతాడు నందు.
మా నాన్న మా ఇంటి దేవుడు అంటాడు నందు. నా దేవుడు.. ఎక్కడ మా నాన్న అంటూ అరుస్తాడు నందు. బయటి నుంచి అనసూయ, తులసి.. నందు మాటలు వింటారు. చెప్తారా.. చెప్పరా అంటాడు నందు. మానాన్నను ఇంటికి తిరిగి తీసుకొస్తాను.. తీసుకొచ్చి తీరుతాను అంటాడు నందు.
ఇంట్లోకి రాబోతున్న అనసూయను అడ్డుకుంటాడు. నాన్న తిరిగి వచ్చే వరకు ఇంట్లోకి రావద్దు అంటాడు. తులసిని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. గెటవుట్ అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.